తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కంగనపై శివసేన 'అస్త్రం' ఊర్మిళ!

కొంత కాలంగా శివసేన పార్టీపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు బాలీవుడ్ నటి కంగనా రనౌత్​. డ్రగ్స్​ మాఫియా సహా పలు అంశాల్లో ఉద్ధవ్​ సర్కారుకు, కంగనకు మధ్య వివాదాలు చెలరేగాయి. ముంబయిని పాక్​ ఆక్రమిత కశ్మీర్​గా పోలుస్తూ ఈ సినీ నటి చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగింది. ఈ నేపథ్యంలోనే ఆమెను ఎదుర్కొనేందుకు శివసేన ఊర్మిళ అస్త్రాన్ని ప్రయోగించినట్లు తెలుస్తోంది.

Urmila Matondkar joins Shiv Sena, attacks Kangana
కంగనపై శివసేన 'అస్త్రం' ఊర్మిళ..!

By

Published : Dec 1, 2020, 6:52 PM IST

సినీ నటి, కాంగ్రెస్​ మాజీ నాయకురాలు ఊర్మిళా మాతోంద్కర్​ శివసేనలో చేరారు. మాతోశ్రీలోని ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే నివాసంలో ఆయన సమక్షంలోనే పార్టీ కండువా కప్పుకున్నారు.

పార్టీ కండువా కప్పుకున్న ఊర్మిళ
శివసేనలో చేరిన ఊర్మిళ

కొంత కాలంగా పార్టీగా ఇబ్బందిగా మారినట్టు భావిస్తున్న సినీ నటి కంగనా రనౌత్​ను ఎదుర్కొనేందుకే.. శివసేన 'ఊర్మిళ' అస్త్రాన్ని ప్రయోగించిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

కంగనా రనౌత్​

ఇదీ చూడండి: శివసేనలోకి ప్రముఖ నటి ఊర్మిళ

వచ్చీరాగానే కౌంటర్​..

ఊహాగానాలకు బలం చేకూరుస్తూ.. పార్టీలోకి వచ్చీరాగానే కంగనపై విరుచుకుపడ్డారు ఊర్మిళ. ఆమెకు అనవసర ప్రాధాన్యం ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. కంగనను పట్టించుకోవద్దన్న తరహాలో మాట్లాడారు.

ఉద్ధవ్​ ఠాక్రే నివాసంలో

'' నేను ఇటీవల చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాను. ప్రతి చోటా వినిపించిన పేరు కంగనా రనౌత్​. ఎక్కువగా ఆమె గురించే అడుగుతున్నారు. నాకు తెలిసి కంగనకు అనవసర ప్రాధాన్యం ఇచ్చారు. నేనిక ఆ అంశం గురించి ఆలోచించే ప్రసక్తే లేదు. ఆమెను పట్టించుకోను.''

- మీడియాతో ఊర్మిళ

వీరిద్దరి మధ్యా..

గతంలో ఈ ఇద్దరు నటీమణులు కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. 'ఊర్మిళ శృంగార తార' అంటూ కంగనా రనౌత్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై సోషల్‌మీడియాలో పెద్ద చర్చే జరిగింది. బాలీవుడ్‌ ప్రముఖులు, పలువురు నెటిజన్లు కంగనకు వ్యతిరేకంగా కామెంట్లు చేశారు.

ఇదీ చూడండి: 'శృంగార తార' వ్యాఖ్యలపై స్పందించిన ఊర్మిళ

డ్రగ్స్​ మాఫియా అంశంలో కంగనపై.. ఊర్మిళ కూడా ఆరోపణలు చేశారు. దేశం మొత్తం మాదకద్రవ్యాలతో పెద్ద సమస్యను ఎదుర్కొంటుందని, డ్రగ్స్​కు మూలం హిమాచల్​ ప్రదేశ్​ అని ఆమెకు తెలుసా అంటూ విమర్శలు గుప్పించారు.

ఉద్ధవ్​ సర్కార్​తో మాటల యుద్ధం..

కంగనా రనౌత్‌తో.. శివసేనకు కొంతకాలంగా చిక్కులు ఎదురవుతున్నాయి. మహారాష్ట్ర సర్కారుకు వ్యతిరేకంగా ఆమె గళం విప్పుతున్నారు. సినీ నటుడు సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ మరణానంతర పరిణామాల నేపథ్యంలో.. ముంబయిని పాక్​ ఆక్రమిత కశ్మీర్​గా పోల్చారు కంగన. ఆ తర్వాత.. సామాజిక మాధ్యమాల వేదికగా ఆమె వ్యాఖ్యలను పలువురు నాయకులు తప్పుబట్టారు. ముంబయిలో అడుగుపెట్టనివ్వమని హెచ్చరించారు.

కంగనా రనౌత్​

ఇవీ చూడండి:

ఉద్ధవ్​ ఠాక్రేపై కంగనా రనౌత్ సంచలన ఆరోపణలు

శివసేన.. ముంబయి ఎవరి జాగీరు?

ఈ నేపథ్యంలోనే భాజపా, శివసేన మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. చివరకు శివసేన- కంగన మధ్య మాటల యుద్ధం పెరిగి న్యాయస్థానాల వరకు చేరింది. కంగనను దీటుగా ఎదుర్కొనేందుకు ఆ పార్టీలో మహిళా నేతలు లేరు. దీంతో కంగనకు కౌంటర్‌ ఇచ్చేందుకు ఊర్మిళను పార్టీలోకి ఆహ్వానించారని వాదనలు వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్​ నుంచి ఓడిపోయి..

ఊర్మిళకు రాజకీయాలు కొత్తేమీ కాదు. 2019 సార్వత్రికంలో కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో దిగారు. ఉత్తర ముంబయి పార్లమెంటు స్థానంలో పోటీ చేసిన ఆమె ఓటమిపాలయ్యారు. 5 నెలల తర్వాత.. కాంగ్రెస్​కు దూరమయ్యారు.

గవర్నర్​ కోటాలో ఊర్మిళకు శాసన మండలి స్థానాన్ని కేటాయించనున్నట్లు శివసేన వర్గాల సమాచారం. ఇప్పటికే ఆమె పేరును రాష్ట్ర గవర్నర్​ బీఎస్​ కోశ్యారీకి పంపించినట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details