తెలంగాణ

telangana

By

Published : Apr 20, 2021, 9:43 PM IST

ETV Bharat / bharat

'దిల్లీలో ఆక్సిజన్ కొరత.. కొన్ని గంటల్లో ఖాళీ!'

దిల్లీలో మరికొన్ని గంటలకు సరిపడా మెడికల్​ ఆక్సిజన్​ నిల్వలు మాత్రమే ఉన్నాయని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ తెలిపారు. ఆక్సిజన్​ను అత్యవసరంగా సరఫరా చేయాలని కేంద్రాన్ని​ కోరారు.

kejriwal
'దిల్లీలో కొన్ని గంటలకు మాత్రమే ఆక్సిజన్'

దిల్లీకి మెడికల్​ ఆక్సిజన్​ను అత్యవసరంగా సరఫరా చేయాలని కేంద్రాన్ని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ కోరారు. పలు ఆసుపత్రుల్లో కొన్ని గంటలకు సరిపడా ఆక్సిజన్​ నిల్వలు మాత్రమే ఉన్నట్లు చెప్పారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని వాణిజ్యం, పరిశ్రమలు శాఖ మంత్రికి కూడా కేజ్రీవాల్​ లేఖ రాశారు.

"దిల్లీలో తీవ్రమైన ఆక్సిజన్ కొరత ఉంది. కొన్ని ఆసుపత్రుల్లో మరికొన్ని గంటలకు సరిపడా ఆక్సిజన్​ మాత్రమే ఉంది. దిల్లీకి ఆక్సిజన్​ను సరఫరా చేయాలని నేను కేంద్రాన్ని మరోసారి కోరుతున్నాను."

-అరవింద్ కేజ్రీవాల్​, దిల్లీ ముఖ్యమంత్రి.

దిల్లీలో ఆక్సిజన్​ వాడకాన్ని పరిశీలించేందుకుగాను 24 మంది సభ్యులతో కూడిన ఓ కమిటీని దిల్లీ ప్రభుత్వం సోమవారం ఏర్పాటు చేసింది.

'పట్టించుకోవట్లేదు'

దిల్లీలో ఆక్సిజన్​ నిల్వలు కేవలం 8 నుంచి 12 గంటలకు మాత్రమే సరిపడా అందుబాటులో ఉన్నాయని దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్​ సిసోడియా తెలిపారు. తాము వారం రోజులుగా దిల్లీకి సరఫరా చేసే ఆక్సిజన్ కోటాను పెంచాలని డిమాండ్​ చేస్తున్నామని పేర్కొన్నారు.

"చాలా ఆసుపత్రుల్లో 8 నుంచి 12 గంటలకు సరిపడా ఆక్సిజన్ నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఎక్కువ ఆక్సిజన్ తక్షణమే​ అందుబాటులోఉంచితే.. ఎంతో మంది జీవితాలపై ప్రభావం ఉంటుంది. దిల్లీకి ఆక్సిజన్​ కోటాను పెంచాలని మేం చేసిన వినతిపై కేంద్రం ఎలాంటి చర్యలు చేపట్టలేదు."

-మనీశ్​ సిసోడియా, దిల్లీ ఉపముఖ్యమంత్రి.

సరఫరా పెంచండి..

రాజస్థాన్​లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. మెడికల్ ఆక్సిజన్​ సరఫరాను పెంచాలని కేంద్రాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రి రఘు శర్మ కోరారు. తమ రాష్ట్రంలో 136 టన్నుల మెడికల్​ ఆక్సిజన్ అవసరమైనప్పటికీ.. కేంద్రం 124 టన్నులను మాత్రమే కేటాయించిందని చెప్పారు. అందులోనూ.. 65 మెట్రిక్​ టన్నులను మాత్రమే ఇప్పటివరకు సరఫరా చేసిందని తెలిపారు.

ఇదీ చూడండి:మహారాష్ట్రలో కఠిన లాక్​డౌన్​కు కేబినెట్ సిఫార్సు

ఇదీ చూడండి:'రాముడి ఆదర్శాలను మనమూ పాటిద్దాం'

ABOUT THE AUTHOR

...view details