Woman Commits Suicide: రాజస్థాన్ బికనీర్‌లో వేగంగా వస్తున్న రైలు కింద పడి మరణించింది 40 ఏళ్ల వివాహిత. ఈ ఘటన సోమవారం జరిగిందని పోలీసులు తెలిపారు. తన భర్త మేనల్లుడి (45) హత్యతో మనస్తాపం చెంది ఈ మేరకు ఆత్మహత్యకు పాల్పడిందని వెల్లడించారు. అతడితో ఆమెకు వివాహేతర సంబంధం ఉందని చెప్పారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, అనంతరం కుటుంబ సభ్యులకు అందజేశారు పోలీసులు. కేసు దర్యాప్తులో ఆమె ప్రియుడిని భర్తే హతమార్చినట్లు తేలిందని అధికారులు తెలిపారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
నన్నెందుకు ప్రేమించవ్?.. యువతిపై ఘాతుకం:మహారాష్ట్రలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించలేదన్న కోపంతో యువతిని గొంతు కోసి చంపేశాడు. ఈ దారుణం ఔరంగాబాద్‌లో శనివారం చోటుచేకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని నాసిక్‌లోని నిఫడ్ తాలుకా లాసల్‌గాన్‌లో అతడి సోదరి ఇంట్లో అరెస్టు చేశారు.