తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సైన్యంలో చేరతారా? యూపీఎస్సీ నుంచి భారీ నోటిఫికేషన్.. శిక్షణ.. ఆపై జాబ్! - indian naval academy course admissions

UPSC NDA notification 2023 : మన దేశంలో సైనికులకు ప్రజలు ఇచ్చే గౌరవం ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తూ, తమ ప్రాణాలను మన కోసం పణంగా పెట్టే జవాన్ల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అందుకే వారిని అందరూ ఆదర్శంగా తీసుకుంటారు. వీర సైనికులను స్ఫూర్తిగా తీసుకొని సైనిక రంగంలోకి వెళ్లిన యువత ఎంతో మంది ఉన్నారు. అలా భారత త్రివిధ దళాల్లో చేరి, దేశానికి సేవ చేయాలనుకునే యువకులకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) శుభవార్త చెప్పింది.

upsc notification 2023
upsc notification 2023

By

Published : May 23, 2023, 11:24 AM IST

UPSC NDA notification 2023 : త్రివిధ దళాల్లో చేరి దేశానికి సేవలు చేసే అద్భుతమైన అవకాశాన్ని యువతకు అందిస్తోంది యూపీఎస్సీ. ఈ మేరకు ఇండియన్ నేవల్ అకాడమీ కోర్సు (ఐఎన్ఏసీ)లో వందలాది ఖాళీలకు నోటిఫికేషన్ జారీ చేసింది యూపీఎస్సీ. నేషనల్ డిఫెన్స్ అకాడమీ-152వ కోర్సుకు గానూ ఈ నోటిఫికేషన్​ను విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వింగ్స్​లో చేరేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయో పరిమితి
నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ)లోని ఆర్మీ, నేవీ, ఎయిర్​ఫోర్స్ వింగ్ కోర్సులో చేరి శిక్షణ తీసుకునేందుకు యూపీఎస్సీ ఈ రిక్రూట్​మెంట్ డ్రైవ్ చేపడుతోంది. ఈ కోర్సులకు ఎంపికైన అభ్యర్థులు శిక్షణను పూర్తి చేసుకున్నాక, వారికి కేటాయించిన వింగ్స్​లో ఉద్యోగాల్లో చేరతారు. ఈ జాబ్స్​కు దరఖాస్తు చేసే అభ్యర్థులు జనవరి 2వ తేదీ 2005 నుంచి జనవరి 1, 2008 సంవత్సరాల మధ్య పుట్టినవారై ఉండాలి. యూపీఎస్సీ అధికారిక నోటిఫికేషన్ ప్రకారం ఈ కోర్సులకు అప్లై చేసేవారు ఇంటర్మీడియట్ చదివి ఉండాలి లేదా 10+2కు సమానమైన కోర్సు చేసి ఉండాలి. అర్హతలు ఉన్నవారు యూపీఎస్సీ అధికారిక వెబ్​సైట్​లోకి వెళ్లి జూన్ 6వ తేదీ 2023లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.

విద్యార్హతలు
Indian naval academy eligibility : యూపీఎస్సీ చేపట్టనున్న ఈ రిక్రూట్​మెంట్ ర్యాలీ ముగిశాక.. ఎంపికైన విద్యార్థులకు 2024 జూలై 2 నుంచి ఇండియన్ నేవల్ అకాడమీ కోర్సులను ప్రారంభిస్తారు. ఈసారి ఏకంగా 395 మంది విద్యార్థులను చేర్చుకోనుంది యూపీఎస్సీ. ఈ కోర్సు కోసం దరఖాస్తు చేసే విద్యార్థులు ఇంటర్మీడియట్ లేదా సమాంతరమైన 10+2 స్కూల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్​ను స్టేట్ ఎడ్యుకేషన్ బోర్డు నుంచి లేదా యూనివర్సిటీ నుంచి పొంది ఉండాలి.

ఫిట్​నెస్ తప్పనిసరి
ఈ కోర్సులకు అప్లై చేసే విద్యార్థులు 12వ తరగతిలో భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, గణితశాస్త్రాలను చదివి, వాటిలో ఉత్తీర్ణులై ఉండాలి. ఈ పోస్టుల దరఖాస్తుకు విద్యార్హతలతో పాటు అభ్యర్థులు శారీరకంగా ఫిట్‎గా ఉండటం కూడా తప్పనిసరి. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్ 2023 గైడ్​లైన్స్ ప్రకారం శారీరక దారుఢ్యం కలిగి ఉన్నవారు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు అర్హులు అని గుర్తుంచుకోవాలి.

ABOUT THE AUTHOR

...view details