UPSC NDA Jobs 2024 :త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం సంపాదించాలని కలలుకంటున్న వారికి శుభవార్త. యూపీఎస్సీ 'నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ' (NDA & NA ) పరీక్ష కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 400 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల యువతీయువకులు గడువులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టుల సంఖ్య
NDA Job Vacancies 2024 :400 ఉద్యోగాలు
విద్యార్హతలు
NDA Jobs 2024 Qualification :
- ఆర్మీ- ఏదైనా స్ట్రీమ్‌లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి.
- నేవీ - ఇంటర్మీడియేట్‌లో ఎంపీసీ చేసినవారు మాత్రమే నేవీ ఉద్యోగాలకు అర్హులు.
- ఎయిర్‌ఫోర్స్- ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగాల దరఖాస్తుకు కూడా ఇంటర్లో కచ్చితంగా ఎంపీసీ సబ్జెక్ట్ చదవి ఉండాలి.
- ప్రస్తుతం ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి
NDA Jobs 2024 Age Limit :2005 జులై 2 నుంచి 2008 జులై 1 మధ్య జన్మించిన అవివాహిత పురుష/మహిళా అభ్యర్థులు మాత్రమే ఉద్యోగానికి అర్హులు.
అప్లికేషన్ ఫీజు
NDA Jobs 2024 Application Fees :
- ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు రుసుము లేకుండా పూర్తి ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
- మిగతా కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ.100 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి.
ఎంపిక ప్రక్రియ
NDA Jobs 2024 Selection Process :
- రాత పరీక్ష
- సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్ఎస్బీ) ఇంటర్వ్యూ