తెలంగాణ

telangana

ETV Bharat / bharat

UPSC Engineering Jobs : ప్రభుత్వ విభాగాల్లో 167 ఇంజినీరింగ్​ ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా! - ఇండియన్​ ఇంజినీరింగ్ సర్వీసెస్​ జాబ్స్​ 2023

UPSC Engineering Jobs In Telugu : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్​ 167 ఇంజినీరింగ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం.

UPSC Recruitment 2023 for 167 Engineering Jobs
UPSC Engineering Jobs

By ETV Bharat Telugu Team

Published : Sep 11, 2023, 10:25 AM IST

UPSC Engineering Jobs : ఇంజినీరింగ్, డిప్లొమాలు చేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు శుభవార్త. యూనియన్​ పబ్లిక్​ సర్వీస్ కమిషన్ (UPSC) 167 ఇంజినీరింగ్​ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఉద్యోగాలు - విభాగాలు
UPSC Engineering Services Vacancy : సివిల్​, మెకానికల్​, ఎలక్ట్రికల్​, ఎలక్ట్రానిక్స్​ & టెలికమ్యునికేషన్​ ఇంజినీరింగ్ విభాగాల్లో ఉద్యోగాలు ఉన్నాయి.

విద్యార్హతలు
UPSC IES Eligibility : ఆయా పోస్టులను అనుసరించి అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యా సంస్థ నుంచి బీఈ, బీటెక్​, డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదా ఆయా పోస్టులను అనుసరించి ఎంఎస్సీ (వైర్​లెస్​ కమ్యునికేషన్,​ ఎలక్ట్రానిక్స్​, రేడియో ఫిజిక్స్​, రేడియో ఇంజినీరింగ్​)లో క్వాలిఫై అయ్యుండాలి.

వయోపరిమితి
UPSC IES Age Limit :అభ్యర్థుల వయస్సు 2024 జనవరి 1 నాటికి 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి.

దరఖాస్తు రుసుము
UPSC IES Application Fee :జనరల్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్​ ఫీజుగా రూ.200 ఆన్​లైన్​లో చెల్లించాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులకు మాత్రం దరఖాస్తు రుసుము నుంచి పూర్తి మినహాయింపు ఇచ్చారు.

ఎంపిక ప్రక్రియ
UPSC IES Selection Process :అభ్యర్థులకు ముందుగా ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైనవారిని మెయిన్ పరీక్షకు ఎంపిక చేస్తారు. ఇందులోనూ క్వాలిఫై అయిన వారికి పర్సనాలిటీ టెస్ట్​, మెడికల్ ఎగ్జామినేషన్​, సర్టిఫికెట్​ వెరిఫికేషన్ చేసి.. ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం
UPSC IES Application Process :అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్​సైట్​​ https://upsc.gov.in/ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం యూపీఎస్సీ ఇంజినీరింగ్ జాబ్స్​​ నోటిఫికేషన్​ను చూడండి.

  • ఆంధ్రప్రదేశ్​, తెలంగాణల్లోని ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు :విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్​
  • ఆంధ్రప్రదేశ్​, తెలంగాణాల్లోని మెయిన్ పరీక్ష కేంద్రాలు : విశాఖపట్నం, హైదరాబాద్​

ముఖ్యమైన తేదీలు
UPSC Engineering Services Important Dates :

  • దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 2023 సెప్టెంబర్​ 6
  • దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2023 సెప్టెంబర్​ 26
  • దరఖాస్తు సవరణకు అవకాశం : 2023 సెప్టంబర్​ 27 నుంచి అక్టోబర్​ 3 వరకు
  • ప్రిలిమినరీ పరీక్ష తేదీ : 2024 ఫిబ్రవరి 18 ​

ABOUT THE AUTHOR

...view details