UPSC Drug Inspector 2022:యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) నుంచి జాబ్ నోటిఫికేషన్ వెలువడింది. 161 పోస్టుల భర్తీకి ఈ విడత నోటిఫికేషన్ ఇచ్చింది కమిషన్. డ్రగ్ ఇన్స్పెక్టర్, సీనియర్ లెక్చరర్, వైస్ ప్రిన్సిపల్ వంటి పోస్టులు ఇందులో ఉన్నాయి. ఈ ఉద్యోగానికి కావాల్సిన అర్హతలు, ఖాళీల వివరాలు, ముఖ్యమైన తేదీల వంటి వివరాలు ఇలా...
ఖాళీల వివరాలు
- మొత్తం ఖాళీలు 161
- డ్రగ్ ఇన్స్పెక్టర్ (హోమియోపతి, సిద్ధ, యునానీకి ఒక్కొక్కటి చొప్పున)- 3
- అసిస్టెంట్ కీపర్- 1
- మాస్టర్ ఇన్ కెమిస్ట్రీ- 1
- మినరల్ అధికారి(ఇంటెలిజెన్స్)- 22
- అసిస్టెంట్ షిప్పింగ్ మాస్టర్, అసిస్టెండ్ డైరెక్టర్- 2
- సీనియర్ లెక్చరర్- 2
- వైస్ ప్రిన్సిపల్- 130
- సీనియర్ లెక్చరర్(కమ్యూనిటీ మెడిసిన్)- 1
అర్హతలు
- డ్రగ్ ఇన్స్పెక్టర్ (హోమియోపతి, సిద్ధ, యునానీకి ఒక్కొక్కటి చొప్పున)- సంబంధిత విభాగంలో డిగ్రీ
- అసిస్టెంట్ కీపర్- పీజీ
- మాస్టర్ ఇన్ కెమిస్ట్రీ- డిగ్రీ, పీజీ
- మినరల్ అధికారి(ఇంటెలిజెన్స్)- డిగ్రీ, పీజీ
- అసిస్టెంట్ షిప్పింగ్ మాస్టర్, అసిస్టెండ్ డైరెక్టర్- డిగ్రీ
- సీనియర్ లెక్చరర్- టెక్స్టైల్ డిగ్రీ
- వైస్ ప్రిన్సిపల్- పీజీ
- సీనియర్ లెక్చరర్(కమ్యూనిటీ మెడిసిన్)- ఎండీ (సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్/ కమ్యూనిటీ మెడిసిన్)