తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యూపీఎస్సీ మెయిన్స్​ ఫలితాలు విడుదల

యూపీఎస్సీ మెయిన్స్​ ఫలితాలు వెల్లడయ్యాయి. త్వరలోనే ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది.

UPSC declares results of civil services main exam
యూపీఎస్సీ మెయిన్స్​ ఫలితాలు విడుదల

By

Published : Mar 23, 2021, 9:41 PM IST

Updated : Mar 23, 2021, 10:37 PM IST

సివిల్ సర్వీసెస్ (మెయిన్స్​) 2020 ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మంగళవారం విడుదల చేసింది. త్వరలోనే దిల్లీలోని ధోల్​పుర్​ హౌస్​లో ఇంటర్వ్యూ (ముఖాముఖి) పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది.

34 మంది జామియా మిలియా ఇస్లామియా రెసిడెన్షియల్ కోచింగ్​ అకాడమీ విద్యార్థులు మెయిన్స్​లో పాసయ్యారు. ఈ మేరకు విశ్వవిద్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

ఏటా మూడు దశల్లో (ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ) సివిల్స్ పరీక్షలు జరుగుతాయి. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్​ఎస్ సహా ఇతర నియామకాలకు వీటిని నిర్వహిస్తారు.

ఇంటర్వ్యూ కోసం అభ్యర్థులు తమ ధ్రువపత్రాలను సిద్ధం చేసుకోవాలని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ తెలిపింది. ఈ-సమన్ లెటర్స్​ను www.upsc.gov.in & www.upsconline.in వెబ్​సైట్​లలో త్వరలోనే అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది. వాటిని భౌతికంగా (పేపర్​ సమన్​ లెటర్​) జారీ చేయడం లేదని స్పష్టం చేసింది. సాధారణ పరిస్థితుల్లో అభ్యర్థులు తమ ఇంటర్వ్యూ తేది, సమయాన్ని మార్చుకోవడానికి వీల్లేదని తెలిపింది.

ఇదీ చూడండి:'కేంద్ర ఉద్యోగులు కార్యాలయాలకు రావాల్సిందే'

Last Updated : Mar 23, 2021, 10:37 PM IST

ABOUT THE AUTHOR

...view details