corona positive students in karnataka: కర్ణాటక ప్రభుత్వం విద్యార్థులకు ర్యాండమ్‌గా నిర్వహిస్తున్న కొవిడ్ పరీక్షల్లో పెద్దఎత్తున కేసులు బయటపడుతున్నాయి. తాజాగా చిక్‌మగళూరు జిల్లాలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 69 మందికి మహమ్మారి సోకినట్లు తేలింది. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌తో సహా మొత్తం 457 శాంపిల్స్‌ను పరీక్షించగా.. ఈ కేసులు బయటపడినట్లు అధికారులు వెల్లడించారు. కరోనా సోకిన వారిలో 59మంది విద్యార్థులు, 10 మంది స్టాఫ్ ఉన్నారు. అయితే కరోనా సోకిన వారిలో ఎవరికి లక్షణాలు లేవని అధికారులు తెలిపారు.
corona in nursing college: మరోవైపు.. శివమొగ్గలోని ఓ ప్రైవేటు నర్సింగ్ కళాశాలలో 29 మంది విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్‌గా వెల్లడైంది. వారిలో చాలా మందికి లక్షణాలు లేవని స్థానిక డిప్యూటీ కమిషనర్ కేబీ శివకుమార్ తెలిపారు. దీంతో ఈ ప్రాంతాలను క్లస్టర్‌లుగా ప్రకటించి, హాస్టళ్లను మూసివేసినట్లు అధికారులు చెప్పారు. పరిసరాల్లో ఎవరికైనా వ్యాప్తి చెందిందా నిర్ధారించేందుకుగానూ.. స్థానికుల నమూనాలనూ పరీక్షిస్తున్నట్లు చెప్పారు.