ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫతేగఢ్ జిల్లాలో ఆశ్చర్యకర ఘటన జరిగింది. బహిర్భూమికి వెళ్లిన ఓ 75 ఏళ్ల వృద్ధురాలు అదుపుతప్పి గంగానదిలో పడిపోయింది. నది ఉద్ధృతికి 40 కిలోమీటర్లు కొట్టుకుపోయింది. వృద్దురాలి కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతికినా.. ఆచూకీ లభించకపోవడం వల్ల మరణించిందని భావించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఆదివారం జరిగింది.
కౌశాంబి జిల్లాలోని కథువా గ్రామంలో శాంతి దేవి.. గంగానది ఒడ్డున పడి ఉండడం గమనించారు స్థానికులు. ఈ క్రమంలో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వృద్ధురాలిని ఆస్పత్రిలో చేర్పించారు. కాసేపటికి స్పృహలోకి వచ్చిన వృద్ధురాలు తన అడ్రసును పోలీసులకు చెప్పింది. వృద్ధురాలు శాంతి దేవి స్వస్థలం.. హత్‌గవాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షామాపుర్గా పోలీసులు గుర్తించారు. పోలీసులు అతని అల్లుడు కేదార్ లాల్‌కు సమాచారం ఇవ్వడం వల్ల అతడు వచ్చి వృద్ధురాలిని ఇంటికి తీసుకెళ్లాడు.