తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రెండేళ్లుగా పోలీస్ అత్యాచారం.. నదిలో దూకిన యువతి - యువతిపై అత్యాచారం

ఓ ట్రాఫిక్ పోలీస్​.. రెండేళ్లుగా ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. ఆ దృశ్యాలను వీడియో తీసి బెదిరించాడు. తీవ్ర మనస్తాపానికి గురైన యువతి.. గంగానదిలో దూకి ఆత్యహత్యకు పాల్పడింది. బాధితురాలిని రక్షించిన పోలీసులు.. ఆస్పత్రికి తరలించారు.

UP woman, raped repeatedly
రెండేళ్లుగా పోలీస్ అత్యాచారం

By

Published : Sep 13, 2021, 10:30 PM IST

ఉత్తర్​ప్రదేశ్​, కాన్పుర్​లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్​.. తన బంధువైన 25ఏళ్ల యువతిపై రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. ఆ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

ఏం జరిగిందంటే..?

మీర్జాపుర్​ జిల్లాకు చెందిన 25ఏళ్ల యువతి.. తన కుటుంబసభ్యులతో కుంభమేళాలో పాల్గొనేందుకు 2019లో అలహాబాద్​లో వారి బంధువైన ట్రాఫిక్​ కానిస్టేబుల్​ ఇంటికి వెళ్లింది. అలహాబాద్​లో ఉన్నప్పుడు.. తనను ఓ హోటల్​కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు ఆరోపించింది. అలా రెండేళ్లుగా అనేక సార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడని వివరించింది. ఈ క్రమంలో తాను గర్భవతి అయినట్లు తెలపగా.. అబార్షన్​ కోసం ఓ పిల్​ కుడా ఇచ్చాడని పేర్కొంది.

ఇటీవల ట్రాఫిక్ కానిస్టేబుల్.. ఆయన కుమారుడితో కలిసి మరోసారి వీడియో తీసి బ్లాక్​మెయిల్ చేసేందుకు యత్నించారని ఆవేదన వ్యక్తం చేసింది. చివరికి వారినుంచి తప్పించుకుని.. చనిపోతున్నట్లు పోలీసులకు సమాచారం ఇచ్చి గంగానదిలో దూకింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని రక్షించారు.

ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడినిపై కేసు నమోదు చేసి.. సస్పెండ్​ చేశారు పోలీసులు. పూర్తి వ్యవహారంపై దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఇదీ చదవండి:నలుగురు కలిసి మహిళను వివస్త్రను చేసి, ఫోన్​లో వీడియో తీసి...

ABOUT THE AUTHOR

...view details