ఉత్తర్‌ప్రదేశ్ రాయ్‌బరేలీకి చెందిన ఓ మహిళకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ వ్యక్తి తనని తాను బ్రిటన్ నివాసితుడిగా పరిచయం చేసుకున్నాడు. కొన్ని రోజుల స్నేహం తర్వాత.. బ్రిటన్ నుంచి ఓ విలువైన కానుక, కొంత నగదు పంపుతానని ఆ మహిళను నమ్మించాడు.
కొన్ని రోజుల తర్వాత మరో మహిళ నుంచి ఆ రాయ్‌బరేలీ వాసికి వాట్సాప్ ఫోన్ వచ్చింది. 'మీ కోసం దిల్లీలో విలువైన కానుక, బ్రిటన్ కరెన్సీలో రూ. 45లక్షలు వేచిచూస్తున్నాయి. వాటిని మీరు తీసుకోవాలంటే కొంత డబ్బు చెల్లించాలి. ఇన్స్టాల్మెంట్లోనైనా చెల్లించవచ్చు,' అని చెప్పింది. అది నమ్మిన ఆ మహిళ.. అలా రూ. 32లక్షలు చెల్లించింది. ఆ తర్వాత ఆ వ్యక్తి, మహిళతో ఆమెకు సంబంధం తెగిపోయింది. ఆ నెంబర్లకు ఎన్నిసార్లు కాల్ చేసినా ఎవరూ స్పందించలేదు.
ఇక ఆమె స్వయంగా దిల్లీకి వెళ్లి 'కానుక' గురించి వాకబు చేసింది. చివరికి తాను మోసపోయినట్టు అర్థం చేసుకుంది. రాయ్‌బరేలీకి తిరిగివెళ్లి, పోలీసులను ఆశ్రయించింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.