ఉత్తర్‌ప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలో ఓ తాగుబోతు భర్త దాష్టీకానికి భార్య బలైంది. అతని 20 ఏళ్ల కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఇదీ జరిగింది..
షామ్లీ జిల్లాలోని గోగ్వాన్ జలాల్పూర్ గ్రామానికి చెందిన ముర్లి సింగ్ మద్యానికి బానిస అయ్యాడు. ఈ క్రమంలో మద్యం తాగి వచ్చి.. తనకు సలాడ్ కావాలని భార్యను అడగ్గా ఆమె అందివ్వలేదు. దీంతో ఇంట్లోని వారు నిద్రిస్తున్న సమయంలో తన భార్య సుదేష్, అతని 20 ఏళ్ల కుమారుడు అజయ్‌పై పారతో దాడి చేశాడు. వారి కేకలు విని ఇరుగుపొరుగు వారు చేరుకునేలోగా సింగ్ అక్కడి నుంచి పారిపోయాడని పోలీసులు వివరించారు.