తన కూతురిపై అత్యాచారయత్నం చేశాడని యువకుని కుటుంబ సభ్యులను ప్రశ్నించిన తల్లిని హతమార్చిన దారుణ ఘటన ఉత్తర్ప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరిగింది.
జిల్లాలోని బువాపూర్ గ్రామానికి చెందిన ఓ బాలిక సమీప పొలాల్లో మేకలను మేపేందుకు వెళ్లింది. ఆమెను నిందితుడు అడ్డగించాడు. లైగికంగా వేధించి ఆమె వస్త్రాలను చించేశాడు. సదరు బాలిక బిగ్గరగా కేకలు వేయడంతో పరారయ్యాడు. ఈ విషయాన్ని ఇంటికి వచ్చి తన తల్లికి వివరించింది బాలిక. బాలిక తల్లి యువకుని కుటుంబంపై.. పోలీసులకు ఫిర్యాదు చేసింది.