తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాశీ విశ్వనాథుడి ఆలయానికి స్థలం ఇచ్చిన ముస్లింలు - ఉత్తర్​ప్రదేశ్​ కాశీ విశ్వనాథ్​ ఆలయం

ఉత్తర్​ప్రదేశ్​ వారణాసిలోని కాశీ విశ్వనాథుడి​ ఆలయానికి 1700 చదరపు అడుగుల స్థలాన్ని అందించారు ముస్లింలు. ఆలయ కారిడార్​ పునర్నిర్మాణం నేపథ్యంలో ఆ స్థలం అవసరమైందని, అందరి సమ్మతితోనే ఇచ్చినట్లు ముస్లిం పెద్దలు తెలిపారు. ఈ నిర్ణయంతో రెండు మతాల మధ్య సామరస్యం, సోదరభావం పెంపొందుతుందనే నమ్మకం ఉన్నట్లు చెప్పారు. అయితే.. వివాదంలో ఉన్న స్థలానికి దీనికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

up varansi temple dispute
శ్రీ కాశీ విశ్వనాథ్​ మందిరం

By

Published : Jul 24, 2021, 6:29 PM IST

వారణాసిలోని గ్యాన్వాపి మసీదు ముందరి 1700 చదరపు అడుగుల స్థలాన్ని కాశీ విశ్వనాథ కారిడార్​ ఆలయ అధికారులకు అందించారు అక్కడి ముస్లింలు. దానికి బదులుగా ఆలయం నిర్వాహకులు మరో ప్రాంతంలో 1000 చదరపు అడుగుల స్థలాన్ని ముస్లింలకు ఇచ్చారు. అయితే.. ఆ ప్రాంతంపై సుదీర్ఘకాలంగా సాగుతోన్న వివాదానికి ముస్లింలు ఇచ్చిన స్థలానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.

గ్యాన్వాపి మసీదుకు ఎదురుగానే ఆ స్థలం ఉండటం వల్ల ఆలయానికి ఇవ్వటం అంత సులభమేమీ కాలేదని ముస్లిం మత పెద్దలు తెలిపారు. స్థలం ఇవ్వాలని ఆలయ నిర్వాహకులు అడిగిన క్రమంలో అందరితో సంప్రదించి ఏకాభిప్రాయానికి వచ్చినట్లు చెప్పారు. ఆ స్థలానికి సంబంధించిన రిజిస్ట్రేషన్​ జులై 8నే ముగిసింది.

స్థలాన్ని బదిలీ చేసినట్లుగా రాసిచ్చిన పత్రం

ప్రస్తుతం ముస్లింలు అందించిన స్థలంలోనే ఆలయానికి చెందిన తాత్కాలిక కంట్రోల్​​ రూమ్​ 1993లో నిర్మించారు. అయితే.. ఆ స్థలంపై పూర్తి హక్కులు ఇప్పుడే లభించినట్లయింది. ఈ విషయంపై కీలక విషయాలు వెల్లడించారు అంజుమ్​ ఇంతెజామియా మసీదు సంయుక్త కార్యదర్శి ఎస్​ఎం యాసిన్​.

"ఈ స్థలాన్ని కంట్రోల్​ రూం కోసం గతంలోనే సున్నీ వక్ఫ్​బోర్డ్​ ఇచ్చింది. ప్రస్తుతం కాశీ విశ్వనాథ్​ కారిడార్​ పనులు ప్రారంభమైన నేపథ్యంలో దారి కోసం ఆ స్థలం అవసరమైంది. అందరితో సంప్రదించి, అందరి అనుమతి తీసుకుని స్థలం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయం రెండు కమ్యూనిటీల మధ్య వారధిలా పనిచేస్తుందనే నమ్మకం ఉంది. శాంతి, సోదరభావ సందేశాన్ని అందిస్తుంది."

- ఎస్​ఎం యాసిన్​​, అంజుమ్​ ఇంతెజామియా మసీదు సంయుక్త కార్యదర్శి.

అయితే మసీదు స్థలంపై ఉన్న వివాదం మీద పలు కీలక విషయాలు వెల్లడించారు యాసిన్​. 'మసీదు భూమిని ఎవరికి ఇవ్వబోము. ఆ విషయంలో కోర్టులో పోరాడుతున్నాం. మసీదు స్థలం మాదీ, దానిని ఇచ్చేది లేదు. ఇప్పుడు ఇచ్చిన స్థలం వేరు.' అని పేర్కొన్నారు.

వివాదం ఏమిటి?

కాశీ విశ్వనాథ్​ ఆలయం, గ్యాన్వాపి మసీదు స్థల వివాదం సుదీర్ఘకాలంగా కొనసాగుతోంది. ఈ సమస్యకు పరిష్కారం కోసం 2019, డిసెంబర్​లో స్థానిక లాయర్​ వీఎస్​ రాస్తోగి.. వారణాసి కోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. మొగల్​ రాజు ఔరంగాజేబ్​ 1664లో 2వేల ఏళ్ల నాటి కాశీ విశ్వనాథ్​ ఆలయంలోని కొంత భాగాన్ని కూల్చివేసి మసీదును నిర్మించాడని పిటిషనర్​ పేర్కొన్నారు. భారత సర్వే విభాగం(ఏఎస్​ఐ)తో మసీదు స్థలాన్ని మొత్తం సర్వే చేయాలని కోరారు. అయితే.. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అంజుమ్​ ఇంతెజామియా మసీదు కమిటీ పిటిషన్​ దాఖలు చేసింది.

ఈ క్రమంలోనే ఈఏడాది ఏప్రిల్​లో భారత సర్వే విభాగానికి అనుమతులు ఇచ్చింది వారణాసి కోర్టు. ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేయాలని ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఇదీ చూడండి:ఆయుధ లైసెన్సుల అక్రమాల కేసులో సీబీఐ సోదాలు

ఇదీ చూడండి:'బుద్ధుని బోధనల శక్తిని ప్రపంచం గ్రహించింది'

ABOUT THE AUTHOR

...view details