Up Tractor Accident News : ప్రమాదవశాత్తు ఓ ట్రాక్టర్ నదిలో పడిపోయిన ఘటనలో నలుగురు చిన్నారులు, ఓ మహిళతో సహా.. మొత్తం తొమ్మిది మంది మృతి చెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సహరాన్‌పుర్ జిల్లాలో బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు ట్రాక్టర్లో 50 మంది భక్తులు ఉన్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెహత్ పరిధిలోని రండోల్ గ్రామంలో ఉన్న జహర్‌వీర్ గోగా జీకి.. పూజలు చేసేందుకు బాధితులంతా ట్రాక్టర్లో వెళ్తున్నారు. వీరంతా గగల్‌హెడి పోలీస్ స్టేషన్ పరిధిలోని బలేలి గ్రామానికి చెందినవారు. రెడ్డిబోడ్కి గ్రామ సమీపంలోని ధమోలా నదిలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పడిపోయింది. బాధితుల కేకలు విన్న స్థానికులు.. వెంటనే అక్కడికి చేరుకుని పలువురిని కాపాడారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.
ఉత్తర్‌ప్రదేశ్ ట్రాక్టర్ ప్రమాద ఘటన హుటాహుటిన ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టి మరికొందరిని కాపాడారు. గాయపడ్డ వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వారి మృతదేహాలను బయటకు తీశారు. ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
నదిలో పడ్డ ఇటుకల లోడ్ ట్రక్కు.. ముగ్గురు మృతి..
Truck Falls Into River :ఇటుకలతో వెళ్తున్న ఓ ట్రక్కు అదుపుతప్పి నదిలో పడిపోయింది. జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఉదంపుర్ జిల్లాలో గురువారం ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా.. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ట్రక్కు ఢీకొని మహిళ మృతి..
Truck Hits Bike in Uttar Pradesh :ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ ట్రక్కు.. బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో 50 ఏళ్ల మహిళ మృతి చెందింది. బాద్గావ్ ప్రాంతంలో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. మృతురాలిని బెల్డా బుగుర్గ్ గ్రామానికి చెందిన సావిత్రిగా పోలీసులు గుర్తించారు. సమీప బంధువైన దీపక్‌తో కలిసి సావిత్రి ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు వారు వెల్లడించారు. ఘటనలో సావిత్రి అక్కడికక్కడే మృతి చెందింది. దీపక్ గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదం అనంతరం ట్రక్కును అక్కడే విడిచి.. డ్రైవర్ పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. అతడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వారు వెల్లడించారు.
కొత్త వందేభారత్ రైళ్లలో విమానం తరహా ఫీచర్.. బ్లాక్‌బాక్స్ సహా ఇంకెన్నో..
Buildings Collapse In Kullu : హిమాచల్‌లో వర్ష బీభత్సం.. పేకమేడల్లా కూలిన భవనాలు