Husband killed wife:ఉత్తర్ప్రదేశ్ షాజహాన్పుర్లో ఓ వ్యక్తి తన భార్య, ఆమె ప్రియుడిని హత్య చేశాడు. ఇందుకు అతడి కుమారులు సైతం సహకారం అందించారు. జలాలాబాద్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఓంపాల్ కుష్వాహా.. తన భార్య మమతతో (40) కలిసి దహార్పుర్ గ్రామంలో నివసిస్తున్నాడు. వీరికి ముగ్గురు కుమారులు.
ప్రియుడితో భార్య.. ఇద్దరినీ కొట్టిచంపిన భర్త.. కొడుకులూ సపోర్ట్! - యూపీ క్రైమ్
Husband killed wife: మరో వ్యక్తితో సహజీవనం చేస్తున్న భార్యను.. కర్రలతో కొట్టి హత్య చేశాడు ఓ వ్యక్తి. భార్య ప్రియుడిని సైతం చంపేశాడు. ఈ హత్యల్లో అతడికి కుమారులు సహకరించారు.
UP MURDER
UP crime Husband killed wife:అయితే, గత రెండేళ్లుగా మమత.. రమన్ పాల్(42) అనే వ్యక్తితో అదే గ్రామంలో సహజీవనం చేస్తోంది. ఈ విషయంపైనే ఓంపాల్ కుష్వాహా, అతడి కుమారులు.. మమతపై కోపంతో ఉన్నారు. ఈ క్రమంలోనే ఇద్దరినీ కర్రలతో కొట్టి చంపారు.
నిందితులు పారిపోయారని పోలీసులు తెలిపారు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని స్థానిక పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ జైశంకర్ తెలిపారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం తరలించనున్నారు. గ్రామంలో పోలీసులను మోహరించారు.
ఇదీ చదవండి: