up accident: ఉత్తర్ప్రదేశ్ బరేలీలోని ఫతేగంజ్లో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అంబులెన్స్, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. భోజిపుర నుంచి దిల్లీ వెళుతున్న అంబులెన్స్ అదుపు తప్పి.. డివైడర్ను దాటి ఓ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు మరణించారు. చనిపోయిన మరో వ్యక్తి అంబులెన్స్ డ్రైవర్. అంబులెన్స్ డ్రైవర్ నిద్రమత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు.
నిద్ర మత్తులో అంబులెన్స్ డ్రైవర్.. ఒకే కుటుంబంలో ఆరుగురు బలి - గుజరాత్ రోడ్డు ప్రమాదం
up accident: అంబులెన్స్, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మొత్తం ఏడుగురు చనిపోగా.. మరో వ్యక్తి అంబులెన్స్ డ్రైవర్. ఈ ప్రమాదం ఉత్తర్ప్రదేశ్ బరేలీలోని ఫతేగంజ్లో మంగళవారం ఉదయం జరిగింది. మరో ప్రమాదంలో పదేళ్ల బాలుడు సహా ఐదుగురు మరణించారు.
పదేళ్ల బాలుడు సహా ఐదుగురు దుర్మరణం: మినీ బస్సు, ఆటో ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతిచెందగా.. మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ ప్రమాదం గుజరాత్లోని పలన్పుర్లో సోమవారం సాయంత్రం జరిగింది. రాజస్థాన్ నుంచి వస్తున్న మినీ బస్సు ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులు అక్కడిక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతుల్లో పదేళ్ల బాలుడు, ముగ్గురు మహిళలు, ఓ పురుషుడు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారికి పలన్పుర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి:భార్య, తల్లిదండ్రులను కాల్చి చంపిన భర్త