తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రోడ్డును చోరీ చేసిన దొంగలు.. PWD మంత్రి సొంత జిల్లాలోనే ఘటన - రోడ్డు దొంగతనం ఉత్తర్​ప్రదేశ్​

రోడ్డు ఎత్తుకెళ్లారు కొందరు దొంగలు. వినడానికి వింతగా ఉన్నా ఇదే జరిగింది. రాష్ట్ర పీడబ్ల్యూడీ మినిస్టర్​ సొంత జిల్లాలో.. నిర్మాణంలో ఉన్న రోడ్డును చోరీ చేశారు. ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

UP Road Stolen
UP Road Stolen

By

Published : Mar 21, 2023, 10:54 PM IST

సాధారణంగా దొంగలు చిన్న చిన్న వస్తువులు చోరీ చేస్తారు. గజ దొంగలైతే కార్లు, బైకులు, ఏటీఎం మెషీన్లు దొంగిలిస్తారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఐరన్​ బ్రిడ్జి దగ్గరి నుంచి రైలు ఇంజిన్​ వరకు.. రోడ్డు రోలర్​ నుంచి సెల్​ టవర్​ వరకు దేన్నైనా సూనాయాసంగా చోరీ చేస్తున్నారు. తాజాగా అంతకుమించిన మరో ఓ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. అందేంటంటే..

ఉత్తర్​ప్రదేశ్​ జరిగిన ఈ విచిత్ర ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రోడ్డును ఎత్తుకెళ్లారు దొంగలు. వినడానికి వింతగా ఉన్నా.. ఇది నిజం. ఈ ఘటన షాజహాన్​పుర్​ జిల్లాలో వెలుగుచూసింది. ఇంకా విచిత్రం ఏంటంటే.. రాష్ట్ర పీడబ్ల్యూడీ శాఖ మంత్రి సొంత జిల్లాలోనే, ఆ శాఖ నిర్మించిన రోడ్డునే చోరీ చేశారు.

చోరీకి గురైన రోడ్డు

ఇంతకీ ఏం జరిగిందంటే..
షాజహాన్​పుర్​ జిల్లాలోని సుజావల్​పుర్​ నుంచి పరశురామ్​పురి వరకు 3 కిలో మీటర్ల రోడ్డును రాష్ట్ర పీడబ్ల్యూడీ (పబ్లిక్​ వర్క్స్​ డిపార్ట్​మెంట్) నిర్మిస్తోంది. అందులో భాగంగా భూమిని చదును చేసి.. ముందు కంకర వేశారు. తారు వేస్తే రోడ్డు పని పూర్తైపోతుంది. కానీ ఇంతలోనే ఈ రోడ్డుపై దొంగలు కన్నేశారు. రోడ్డుపై ఉన్న కంకరను దొంగిలించాలని ప్లాన్ చేశారు. మార్చి 16న రాత్రి 3 గంటల సమయంలో జేసీబీ సహాయంతో దాదాపు 250 మీటర్ల పొడవునా కంకర ట్రాక్టర్​ ట్రాలీల్లో నింపారు. ఇది గమనించిన గ్రామస్థులు నిలదీయగా.. తాను రోడ్డు కాంట్రాక్టర్​నని నమ్మబలికాడో దుండగుడు. అనంతరం కంకర నింపిన ట్రాక్టర్లతో పరారయ్యాడు. కాగా, దొంగిలించిన కంకర విలువ రూ. 5 లక్షలకు పైగా ఉంటుందని పీడబ్ల్యూడీ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఆ రోడ్డు కాంట్రాక్టర్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఈ ఘటనపై పబ్లిక్​ వర్క్స్ డిపార్ట్​మెంట్​ సూపరింటెండెంట్​ ఇంజినీర్​ స్పందిచారు. ఈ విషయంపై పీడబ్ల్యూడీ ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారని.. నిందితులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

నిర్మాణం జరుగుతున్న రోడ్డు
నిర్మాణం జరుగుతున్న రోడ్డు

సెల్​ఫోన్​ టవర్​ చోరీ..
ఎన్ని చర్యలు తీసుకున్నా దోపిడీలకు అడ్డుకట్ట పడటం లేదు. ఐరన్‌ బ్రిడ్జి, రైలు ఇంజన్‌ లాంటి వాటిని కూడా దొంగలిస్తున్న కేటుగాళ్లు.. సెల్​ఫోన్​ టవర్లను సైతం చోరీ చేశారు. జనవరిలో జరిగిన ఈ దొంగతనాన్ని చూసి పోలీసులే షాక్​కు గురయ్యారు. ఈ వింత చోరీ సబ్జీబాగ్ ప్రాంతంలో వెలుగు చూసింది. కాగా, చోరీకి గురైన సెల్​ టవర్​ విలువ రూ.8.32 లక్షలు ఉంటుందని తెలిసింది. బిహార్​లోని పట్నాలో సెల్​ఫోన్​ టవర్ దొంగతనం జరగడం ఇదేం మొదటి సారి కాదు. ఇంతకుముందు 2022 నవంబర్​లో రూ.19 లక్షల విలువైన టవర్​ను చోరీ చేశారు. ఈ చోరీ ఎలా జరిగిందో తెలియాలంటే ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details