తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'యువతే బలం.. కొత్త యూపీని సృష్టిస్తాం' - యూపీ పోల్స్​ 2022

UP Congress Youth Manifesto: అసెంబ్లీ ఎన్నికల వేళ ఆయా పార్టీలు.. జనాలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా ఉత్తర్​ప్రదేశ్​ యువత కోసం ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేసింది కాంగ్రెస్​. యువతకు మంచి భవిష్యత్తు కావాలంటే కాంగ్రెస్​ను ఎన్నుకోవాలని కోరింది.

UP polls Cong's 'youth manifesto'
UP polls Cong's 'youth manifesto'

By

Published : Jan 21, 2022, 2:23 PM IST

UP Congress Youth Manifesto: ఉత్తర్​ప్రదేశ్​లో వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో.. యువతను ఉద్దేశించి ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేసింది కాంగ్రెస్​ పార్టీ. దీనికి 'భర్తీ విధాన్'​ అని పేరుపెట్టింది. దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మేనిఫెస్టో ఆవిష్కరించారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ.

అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలను అన్నింటినీ భర్తీ చేయాలని కాంగ్రెస్​ తీర్మానించింది. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఇందులో మహిళలకే 8 లక్షలు కేటాయించింది.

ఈ సందర్భంగా.. యువతకు మంచి భవిష్యత్తు కాంగ్రెస్​తోనే సాధ్యమని అన్నారు రాహుల్​. యువతను సంప్రదించి వారి దృక్కోణాలు ప్రతిబింబించేలా ఈ మేనిఫెస్టో రూపొందించినట్లు పేర్కొన్నారు.

''ఉత్తర్​ప్రదేశ్​ యువతకు మంచి భవిష్యత్తు కావాలి. అది కాంగ్రెస్​ మాత్రమే సాధ్యం చేయగలదు. మేం విద్వేషాలను వ్యాప్తి చేయబోం. ప్రజలను ఏకం చేస్తాం. యువతను బలంగా తీర్చిదిద్ది.. సరికొత్త ఉత్తర్​ప్రదేశ్​ను సృష్టిస్తాం.''

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ మాజీ అధ్యక్షుడు

రాష్ట్రంలో యువత నిరాశలో ఉన్నారని, నిరుద్యోగమే అతిపెద్ద సమస్య అని అన్నారు ప్రియాంకా గాంధీ. కుల, మత రాజకీయాల జోలికి వెళ్లకుండా.. రాష్ట్రాభివృద్ధినే కాంగ్రెస్​ కోరుకుంటోందని ఆమె అన్నారు.

యువత, మహిళలకు పెద్దపీట వేస్తూ కాంగ్రెస్​ యూపీలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తోంది. కాంగ్రెస్​ పోటీచేయనున్న స్థానాల్లో 40 శాతం మహిళలకే అని ఇదివరకే ప్రకటించారు ప్రియాంక.

UP Polls 2022:మొత్తం 403 స్థానాలున్న యూపీ అసెంబ్లీకి ఏడు దశల్లో పోలింగ్​ జరగనుంది. ఫిబ్రవరి 10న మొదలై.. మార్చి 7న చివరిదశతో ఎన్నికలు ముగుస్తాయి. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చూడండి: ప్రియాంక ఎంట్రీతో యూపీ ఎన్నికల్లో నష్టం ఎవరికి ?

ఎస్పీకి ములాయం కుటుంబ సభ్యుల గుడ్​బై- అఖిలేశ్​కే లాభమా?

ABOUT THE AUTHOR

...view details