ఉత్తర్‌ప్రదేశ్ ఘజియాబాద్‌కు చెందిన ఓ ముస్లిం వృద్ధుడిపై దుండగులు దాడి చేసిన ఘటనపై రాజకీయ దుమారం చెలరేగిన క్రమంలో చర్యలు చేపట్టారు ఆ రాష్ట్ర పోలీసులు. తనపై దాడి చేసినట్లు వృద్ధుడు పేర్కొన్న వీడియో వైరల్‌గా మారిన నేపథ్యంలో.. ట్విట్టర్, ఓ న్యూస్ పోర్టల్ సహా ఆరుగురిపై కేసు నమోదు చేశారు.
మతపరమైన ఘర్షణలు సృష్టించాలనే ఉద్దేశంతో వీడియోను షేర్ చేశారని స్థానిక పోలీసు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఘజియాబాద్‌లోని.. లోనీ బార్డర్ పోలీస్ స్టేషన్లో మంగళవారం రాత్రి 11.30 గంటలకు కేసు నమోదైంది.
ఆరుగురు అరెస్ట్..
ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఆరుగురిని అరెస్ట్ చేశారు ఘజియాబాద్ పోలీసులు. అందులో ముస్లింలు సైతం ఉన్నారు. ఇందులో ఎలాంటి మతపరమైన కోణం లేదని స్పష్టం చేశారు. ట్విట్టర్ ఐఎన్‌సీ, ట్విట్టర్ కమ్యూనికేషన్స్ ఇండియా, న్యూస్ వెబ్సైట్ వైర్, జర్నలిస్టులు మహమ్మద్ జుబెయిర్, రాణా అయుబ్, కాంగ్రెస్ నేతలు సల్మాన్ నిజామి, మస్కూర్ ఉస్మాని, డాక్టర్ సామ మహమ్మద్, రచయిత సబా నఖ్వీపై కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.