తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పిచాయ్​పై కాశీలో కేసు- కొద్ది రోజుల్లోనే... - ప్రధాని మోదీని అగౌపరిచేలా ఉన్న ఓ వీడియో

ప్రధాని మోదీని అగౌరవ పరిచేలా ఉన్న ఓ వీడియో కేసులో గూగుల్​ సీఈఓపై ఉత్తర్​ ప్రదేశ్​ పోలీసులు ఎఫ్​ఐఆర్​ నమోదు చేసి కొన్ని రోజుల్లోనే తొలగించారు.

UP Police books Google's Sundar Pichai, others over 'defamatory' video; removes names from FIR later
ఎఫ్​ఆర్​నుంచి గూగుల్​ సీఈఓ సుందర్​ పిచాయ్​ పేరు తొలగింపు

By

Published : Feb 12, 2021, 3:39 PM IST

ప్రధాని నరేంద్ర మోదీని కించపరిచేలా ఉన్న ఓ వీడియో కేసులో గూగుల్​ సీఈఓ సుందర్​ పిచాయ్​పై ఎఫ్​ఆర్​ నమోదు చేసి, కొన్ని రోజుల్లోనే తొలగించారు ఉత్తర్​ ప్రదేశ్​లోని వారణాసి​ పోలీసులు. సుందర్​ పిచాయ్​తో పాటు ఆ సంస్థకు చెందిన ముగ్గురికి ఈ కేసుతో సంబంధం లేదని ఎఫ్​ఐఆర్​ నుంచి వారి పేర్లను తొలగించినట్లు తెలిపారు.

మోదీ ప్రతిష్ఠను దిగజార్చేలా ఉన్న వీడియోను వారణాసికి చెందిన ఓ వ్యక్తి వాట్సాప్​ గ్రూపుల్లో, యూట్యూబ్​లో చూశాడు. దానిపై అభ్యంతరం వ్యక్తం చేయగా... 8,500 బెదిరింపు కాల్స్​ వచ్చాయంటూ పోలీసులుకు ఫిర్యాదు చేశాడు. దాంతో పిచాయ్​తో పాటు మరో 17 మందిపై ఫిబ్రవరి 6న పోలీసులు ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు.

ఇదీ చూడండి:గూగుల్ సంస్థ​పై అమెరికా న్యాయశాఖ దావా

ABOUT THE AUTHOR

...view details