తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యూపీలో సంకీర్ణం తప్పదా? తొలి దశ పోలింగ్ ఏం చెబుతోంది? - యూపీ తొలిదశ ఎన్నికలు

UP phase-1 assembly polls: ఉత్తర్​ప్రదేశ్ తొలి దశ ఎన్నికల్లో విజయం మాదేనంటూ అన్ని పక్షాలు ప్రకటించుకుంటున్నాయి. భాజపా జెండా అందనంత ఎత్తులో ఎగురుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. మరోవైపు, ఫలితాలు రాకముందే రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు విషయం స్పష్టమైందని సమాజ్​వాదీ అధినేత చెప్పుకొచ్చారు.

UP phase 1 assembly polls
UP phase 1 assembly polls

By

Published : Feb 11, 2022, 6:25 PM IST

UP phase-1 assembly polls: ఉత్తర్​ప్రదేశ్​లో తొలి దశ ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో ఆధిక్యం లభించేది తమకేనంటూ వివిధ పార్టీలు చెప్పుకుంటున్నాయి. తొలి దశ తర్వాత భాజపా జెండా అందనంత ఎత్తులో ఎగురుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. కాస్​గంజ్​లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన.. విపక్షాల ఆశలన్నీ అడియాశలయ్యాయని అన్నారు. అందుకే ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు.

UP election result

"నిన్న ఉత్తర్​ప్రదేశ్ తొలి దశ ఎన్నికలు జరిగాయి. భాజపా రికార్డు మెజారిటీతో గెలుస్తుందని స్పష్టమవుతోంది. భాజపా గెలవాలని మాకంటే ఎక్కువగా రాష్ట్రంలోని ప్రజలే బలంగా నిశ్చయించుకున్నారు. మంచి పనులు చేసే పార్టీలను, అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చే వారిని ఓటర్లు ఎల్లప్పుడూ ఆదరిస్తారు."

-ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

అంతకుముందు, ఉత్తరాఖండ్ అల్మోరాలో నిర్వహించిన సభను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్​పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సబ్​కా సాత్ సబ్​కా వికాస్ నినాదంతో తాము ముందుకెళ్తుంటే.. విపక్షాలు మాత్రం అందరినీ విభజించి దోచుకోవాలన్న సూత్రంతో పనిచేస్తోందని మండిపడ్డారు.

మరోవైపు, ఉత్తర్​ప్రదేశ్​లో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమని తేలిపోయిందని సమాజ్​వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ జోస్యం చెప్పారు. 'తొలి దశ ఎన్నికలు అయిపోయాయి. ఫలితం మార్చి 10 వస్తుంది. కానీ యూపీలో సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడుతుందని ఇప్పుడే స్పష్టమైపోయింది' అని చెప్పుకొచ్చారు.

ఇదీ చదవండి:హిల్​స్టేట్​లో 'హిట్' కొట్టేదెవరు? ఈ 'సీఎం'తో అయినా ట్రెండ్ మారేనా?

ABOUT THE AUTHOR

...view details