తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఓటర్ల కోసం 2 క్వింటాళ్ల జిలేబీలు, 1000 సమోసాలు

ఉత్తర్​ప్రదేశ్​ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు ఓ అభ్యర్థి సిద్ధం చేసిన రెండు క్వింటాళ్ల జిలేబీలు, వెయ్యికి పైగా సమోసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పది మందిని అరెస్టు చేశారు.

UP panchayat polls
ఓటర్ల కోసం 2 క్వింటాళ్ల జిలేబీలు, 1,050 సమోసాలు

By

Published : Apr 11, 2021, 12:27 PM IST

Updated : Apr 11, 2021, 12:33 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అక్కడి నేతలు వినూత్న ఎత్తుగడలు వేస్తున్నారు. హసన్​గంజ్​లో ఓటర్లకు పంచేందుకు ఓ అభ్యర్థి.. 2 క్వింటాళ్ల జిలేబీలు, 1,050 సమోసాలను సిద్ధం చేయగా..​ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్​ ఉల్లంఘించారనే కారణంతో 10 మందిని అరెస్టు చేశారు.

ఓటర్లకు పంచేందుకు సిద్ధం చేసిన సమోసాలు, జిలేబీలు

మందస్తు సమాచారంతో హసన్​గంజ్​లోని సదరు అభ్యర్థి ఇంటిపై పోలీసులు దాడి చేశారు. ఎల్​పీజీ సిలిండర్లు, పిండి, నెయ్యి సహా జిలేబీలు, సమోసాలు, వాటిని తయారు చేయడానికి సిద్ధం చేసిన ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

ఉత్తర్​ప్రదేశ్​లో పంచాయతీ ఎన్నికలు.. ఏప్రిల్​ 15 నుంచి నాలుగు విడతల్లో జరగనున్నాయి. ఏప్రిల్​ 29న తుది దశ ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి.

ఇదీ చూడండి:విమానం టాయిలెట్​లో 1.36 కిలోల బంగారం

Last Updated : Apr 11, 2021, 12:33 PM IST

ABOUT THE AUTHOR

...view details