తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అతివేగంతో ట్రక్కును ఢీకొన్న కారు- ఆరుగురు స్నేహితులు దుర్మరణం - ఝార్ఖండ్​లో అగ్నిప్రమాదం ముగ్గురు మృతి

UP Muzaffarnagar Road Accident : ఉత్తర్​ప్రదేశ్​లోని ముజఫర్‌నగర్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు స్నేహితులు మృతి చెందారు. వీరంతా దిల్లీ వాసులుగా గుర్తించారు పోలీసులు.

UP Muzaffarnagar Road Accident
UP Muzaffarnagar Road Accident

By ETV Bharat Telugu Team

Published : Nov 14, 2023, 11:12 AM IST

Updated : Nov 14, 2023, 12:14 PM IST

UP Muzaffarnagar Road Accident : అతి వేగంగా ప్రయాణిస్తున్న కారు.. ముందు వెళ్తున్న ట్రక్కును ఢీకొన్న ఘటనలో ఆరుగురు స్నేహితులు మృతి చెందారు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున ఉత్తర్​ప్రదేశ్​ ముజఫర్‌నగర్‌లోని దిల్లీ-హరిద్వార్ జాతీయ రహదారిపై జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. కారులో చిక్కుకున్న ఆరుగురి మృతదేహాలను అతికష్టం మీద బయటకు తీసుకువచ్చారు. పోస్ట్​మార్టం నిమిత్తం వాటిని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, మృతులంతా దిల్లీలోని షాహ్​దరాకు చెందిన వారుగా గుర్తించారు పోలీసులు. వీరంతా హరిద్వార్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని సర్కిల్ ఆఫీసర్​ వినయ్​ గౌతమ్ చెప్పారు. ప్రమాదంపై కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని ఆయన తెలిపారు.

ప్రమాదంలో నుజ్జునుజ్జైన కారు

అగ్నిప్రమాదంలో ముగ్గురు మృతి!
Jharkhand Fire Accident :ఝార్ఖండ్​ ధన్​బాద్​ జిల్లాలోని ఓ మార్కెట్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికుల కథనం ప్రకారం.. ధన్‌బాద్‌లోని కెందువా మార్కెట్‌లో ఉన్న ఓ దుకాణంలో సోమవారం రాత్రి ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. కొద్దిసేపట్లోనే ఈ మంటలు పైఅంతస్తులో ఉన్న దుకాణ యజమాని ఇంటికీ వ్యాపించాయి. దీంతో ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ఆరుగురికిపైగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రెండు అగ్నిమాపక యంత్రాలతో ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్​ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈలోపు స్థానికుల సాయంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ధన్‌బాద్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో అగ్నిప్రమాదం జరిగిన దుకాణం పక్కన ఉన్న మరో నాలుగు దుకాణాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి.

"ఈ విషాద ఘటనలో దుకాణదారుడు సుభాశ్​ గుప్తా సోదరి 23 ఏళ్ల ప్రియాంక గుప్తా, 70 ఏళ్ల తల్లి ఉమా దేవి, 5 ఏళ్ల కుమార్తె మౌలి గుప్తా ప్రాణాలు విడిచారు. సుభాశ్​ గుప్తా, అతడి భార్య, రెండేళ్ల కుమారుడు, తండ్రి సహా ఇతర కుటుంబ సభ్యులు గాయపడ్డారు. ఈ ఘటనలో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించిన కొందరు స్థానికులు కూడా గాయపడ్డారు."

Last Updated : Nov 14, 2023, 12:14 PM IST

ABOUT THE AUTHOR

...view details