ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ నేత వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. ఇటీవలే హత్యకు గురైన.. గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశాడు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పైనా తీవ్ర విమర్శలు గుప్పించాడు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశాడు. మైనారిటీల ఓట్ల కోసమే ఈ తరహాలో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆ నేత చేసిన వ్యాఖ్యలు.. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. జాతీయ జెండాను సైతం ఆ వ్యక్తి అవమానపరిచాడు. దీంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రాజ్‌కుమార్ సింగ్.. ప్రయాగ్‌రాజ్‌కి చెందిన వ్యక్తి. అతడు కాంగ్రెస్ పార్టీ తరఫున.. మున్సిపల్ ఎన్నికల్లో బరిలో దిగాడు. 43 వార్డు నుంచి అతడు పోటీ చేస్తున్నాడు. గురువారం ఎన్నికల ప్రచారంలో.. అతీక్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అదే విధంగా.. అతీక్ అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత ములాయం సింగ్ యాదవ్‌కు ప్రభుత్వం పద్మ విభూషన్ ఇచ్చిందని.. అతీక్‌కు ఎందుకు భారతరత్న ఇవ్వకూడదని ప్రశ్నించాడు. రాజ్‌కుమార్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేస్తుండగా.. ప్రయాగ్‌రాజ్ కాంగ్రెస్ సిటీ ప్రెసిడెంట్ ప్రదీప్ మిశ్రా పక్కనే ఉన్నారు. ఆ సమయంలో రాజ్‌కుమార్‌ను ఆయన అడ్డుకునే ప్రయత్నం చేశారు.
అతీక్ సమాధికి నివాళులు అర్పించిన రాజ్‌కుమార్..
వివాదస్పద వ్యాఖ్యల అనంతరం అతీక్ సమాధి వద్దకు వెళ్లాడు రాజ్‌కుమార్. అనంతరం సమాధి వద్ద అతీక్‌కు నివాళులు అర్పించాడు. సమాధిపై జాతీయ జెండాను ఉంచి సెల్యూట్ చేశాడు. అతీక్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించాడు. అతీక్ అమర్ రహే, అమర్ రహే అంటూ నినాదాలు చేశాడు.
పార్టీ నుంచి సస్పెండ్..
రాజ్‌కుమార్ వ్యాఖ్యలను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా తీసుకుంది. అతడిని పార్టీ నుంచి బహిష్కరించింది. మున్సిపల్ ఎన్నికల బరిలో నుంచి తప్పించింది. గత 6 సంవత్సరాలుగా రాజ్‌కుమార్ ఇలాంటి వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ సిటీ ప్రెసిడెంట్ ప్రదీప్ మిశ్రా అన్నారు. రాజ్ కుమార్ మానసిక పరిస్థితి బాగాలేదని ఆయన పేర్కొన్నారు. మరోవైపు.. వివాదస్పద వ్యాఖ్యలు చేసిన రాజ్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. జాతీయ జెండాను అవమాన పరిచినందుకుగానూ రాజ్‌కుమార్‌పై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.