తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రూ. 500 నోట్ల కట్ట లాక్కొని చుక్కలు చూపిన కోతి! - monkey steals money

కోతి చేష్టలు ఎలా ఉంటాయో తెలిసిందే! ఇళ్లలోకి వెళ్లి వస్తువులు ఎత్తుకెళ్లడం, మనుషుల దగ్గర తినే పదార్థాలుంటే ఎగబడటం వంటివి తరచూ జరుగుతూనే ఉంటాయి. ఇవి కొన్నిసార్లు నవ్వు తెప్పించినా.. అప్పుడప్పుడు ప్రాణాల మీదకూ తెస్తాయి. తాజాగా.. అలాంటి వింత ఘటన ఉత్తర్‌ ప్రదేశ్‌లోని సీతాపూర్‌లోని రిజిస్టార్‌ కార్యాలయంలో జరిగింది.

By

Published : Dec 24, 2020, 6:12 AM IST

కుమారుడి వైద్య ఖర్చుల కోసం భూమిని విక్రయించిన వృద్ధుడి నుంచి ఓ కోతి డబ్బు లాక్కెళ్లి గంటసేపు హంగామా సృష్టించిన ఉదంతమిది. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఖైరాబాద్‌కు చెందిన భగవాన్‌దీన్‌.. తాను విక్రయించిన భూమిని కొనుగోలుదారుడి పేరు మీదకు మార్పించేందుకు సీతాపుర్‌లోని రిజిస్టార్‌ కార్యాలయానికి బుధవారం వచ్చారు. రిజిస్ట్రేషన్‌ పని పూర్తయ్యాక కొనుగోలుదారు ఆయనకు రూ.4 లక్షలు ముట్టజెప్పారు. కార్యాలయ ప్రాంగణంలోని ఓ చెట్టు కింద కూర్చొని భగవాన్‌దీన్‌ వాటిని లెక్కపెట్టుకుండగా.. ఒక్కసారిగా ఓ వానరం రూ.500 నోట్లున్న కట్టను లాక్కొని చెట్టెక్కేసింది. అందులో నుంచి కొన్ని నోట్లను తీసి కిందకు విసరడం ప్రారంభించింది.

ఎట్టకేలకు..

భగవాన్‌దీన్‌ తీవ్ర ఆందోళనతో అరుస్తుండగా, అక్కడ జనం గుమిగూడారు. పండ్లు, ఇతర ఆహార పదార్థాలు ఆశ చూపిస్తూ వానరం నుంచి డబ్బు రాబట్టేందుకు ప్రయత్నించారు. దాదాపు గంట తర్వాత ఎట్టకేలకు నోట్ల కట్టను కోతి కిందకు విసరడంతో భగవాన్‌దీన్‌ ఊపిరి పీల్చుకున్నారు. అప్పటికే రూ.7 వేల విలువైన నోట్లు చిరిగిపోయాయి. తన కుమారుడికి వైద్య చికిత్స చేయించేందుకుగాను భూమిని విక్రయించినట్లు భగవాన్‌దీన్‌ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details