UP Minor Girl Rape: తొమ్మిదేళ్ల చిన్నారిపై ఇద్దరు మైనర్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దుర్ఘటన ఉత్తర్ప్రదేశ్ ముజఫర్నగర్ జిల్లాలో వెలుగుచూసింది. కొన్ని రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇదీ జరిగింది..

"బాధితురాలు తన ఇంటికి సమీపంలో ఆడుకుంటుండగా.. 10, 14 ఏళ్ల వయసున్న ఇద్దరు బాలురు ఆమెను అపహరించారు. అక్కడ నుంచి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఘాతుకానికి ఒడిగట్టారు" అని ఫిర్యాదులో చిన్నారి తల్లిదండ్రులు పేర్కొన్నారు.
కొన్నిరోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై ఈ నెల 5న బాధితురాలి తల్లిదండ్రులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. వైద్యుల నివేదిక ఆధారంగా తదుపరి దర్యాప్తు చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి:కారు అడ్డగించి.. మహిళను పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం!