Swami Prasad Maurya News: ఉత్తర్‌ప్రదేశ్‌లో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగుతాయనగా అక్కడి భాజాపా ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీలో రాజీనామాల పర్వం మొదలైంది. మంగళవారం.. ఆ పార్టీకి చెందిన కేబినెట్ మంత్రి స్వామిప్రసాద్ మౌర్య పార్టీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. మంత్రి పదవికి కూడా రాజీనామా చేశారు. స్వామి ప్రసాద్ రాజీనామా చేసిన గంటల వ్యవధిలో మరో ముగ్గురు భాజపా ఎమ్మెల్యేలు పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు.
అదే కారణం..
దళితులు, రైతులు, నిరుద్యోగ యువత, చిన్నా-మధ్య తరగతి వ్యాపారులపై ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరే తన రాజీనామాకు కారణమన్నారు స్వామి ప్రసాద్. గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌కు సమర్పించిన రాజీనామా లేఖలో ఈ విధంగా పేర్కొన్నారు.
2016లో మౌర్య.. బహుజన్ సమాజ్ పార్టీ నుంచి భాజపాలో చేరారు. పద్రౌన నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు మౌర్య ఐదు సార్లు ఎమ్మెల్యేగా సేవలు అందించారు.
భాజపాకు స్వామి ప్రసాద్ రాజీనామాను సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ స్వాగతించారు. 'సామాజిక న్యాయం, సమానతల కోసం పోరాడే స్వామి ప్రసాద్ సహా ఆయన కార్యకర్తలు, మద్దతుదార్లను ఎస్పీలోకి ఆహ్వానిస్తున్నాను. స్వామీ ప్రసాద్ బుధవారం పార్టీలోకి చేర్చుకోనున్నాము.' అని అఖిలేశ్ ట్వీట్ చేశారు.
గంటల వ్యవధిలో..
స్వామి ప్రసాద్ రాజీనామా చేసిన కొన్ని గంటలకే మరో ముగ్గురు భాజపా ఎమ్మెల్యేలు పార్టీ నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించారు. బ్రజేశ్ ప్రజాపతి, రోషన్ లాల్, భగవతి సాగర్.. మౌర్యకు మద్దతుగా తాము పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. వీరంతా సమాజ్‌వాదీ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అంతేకాదు.. మౌర్య రాజీనామాతో ప్రస్తుతం భాజపాలో ఉన్న కీలక నేతలు దారా సింగ్ చౌహాన్, ధరమ్ సింగ్ సైనీ, నంద్‌గోపాల్ గుప్తా కూడా సమాజ్‌వాదీ పార్టీలలో చేరనున్నట్లు సమాచారం.
'తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు'