తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహిళపై గ్యాంగ్​రేప్.. డ్రగ్స్ ఇచ్చి దారుణం.. కాలిపై బైక్​ ఎక్కించి.. - up mathura gang rape

UP Mathura gang rape: యూపీలో ఘోరం జరిగింది. ఓ మహిళపై దారుణ అత్యాచారం జరిగింది. గ్యాంగ్ రేప్ చేసిన తర్వాత నిందితులు మహిళపై బైక్​ను ఎక్కించారు. అనంతరం అడవిలో పడేశారు. తీవ్రంగా దెబ్బతిన్న బాధితురాలి కాలిని వైద్యులు తొలగించారు.

up-mathura-woman-gang-rape
up-mathura-woman-gang-rape

By

Published : Jul 13, 2022, 2:03 PM IST

Updated : Jul 13, 2022, 2:57 PM IST

UP Mathura rape: ఉత్తర్​ప్రదేశ్ మథురలో దారుణమైన అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడిన దుండగులు.. అత్యంత పాశవికంగా ప్రవర్తించారు. రేప్ చేసిన తర్వాత.. మహిళ కాళ్ల పైనుంచి బైక్​ను పోనిచ్చారు. అనంతరం, బాధితురాలిని అడవిలో పడేశారు. కోసికాలా పోలీస్ స్టేషన్​లో మే 24న జరిగిన ఈ ఘటన ఇప్పుడు బయటపడింది. మంగళవారం ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

మే 24న బాధిత మహిళ బ్యాంకు నుంచి నగదు విత్​డ్రా చేసుకొని తన ఇంటికి బయల్దేరింది. టెంపో స్టాండ్ వద్ద వాహనం కోసం ఎదురుచూసింది. ఆ సమయంలో మహిళ గ్రామానికే చెందిన మహేశ్ అనే వ్యక్తి.. ఇంటి వద్ద దింపేస్తానని చెప్పి బైక్ ఎక్కించుకున్నాడు. ఆ తర్వాత తన స్నేహితుడు మహేంద్ర సహా ముగ్గురిని పిలిచాడు. అందరూ కలిసి మహిళకు మత్తుపానీయాలు తాగించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

కాలు తొలగింపు...
మహిళ పైనుంచి ద్విచక్రవాహనాన్ని ఎక్కించారు. గాయపడ్డ బాధితురాలిని స్థానిక అటవీ ప్రాంతంలోని ఓ కెనాల్ వద్ద పొదల్లో పడేశారు. స్పృహలోకి వచ్చిన మహిళ.. ఇంటికి చేరుకుంది. కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం హరియాణాకు తరలించారు. ద్విచక్రవాహనాన్ని ఎక్కించడం వల్ల మహిళ కాలు తీవ్రంగా దెబ్బతింది. ఒక కాలిని తొలగించాల్సి వచ్చింది.

మహిళకు కాలు తొలగింపు

మంగళవారం బాధితురాలి కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నారు. నిందితులు మహేశ్, మహేంద్రను నిమిషాల వ్యవధిలోనే అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఎస్సై మోసం
ఉత్తర్​ప్రదేశ్​లో ఓ ఎస్సై.. ప్రేమ పేరుతో మహిళను మోసం చేశాడు. కొత్వాలీ నగర్ గోండాలో పనిచేస్తున్న వాసిం ఖాన్.. తనను తాను రింకూ శుక్లగా పరిచయం చేసుకొని ఓ మహిళను మభ్యపెట్టాడు. మూడేళ్ల నుంచి మహిళను ట్రాప్ చేస్తూ వచ్చిన నిందితుడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై కుటుంబ సభ్యులు.. ఇతర మతస్థులతో వివాహానికి అంగీకరించలేదు. అప్పటి నుంచి మహిళను వాసిం ఖాన్ దూరం పెట్టాడు.

అయితే, ఎస్సై తనను మోసం చేశాడని బాధితురాలు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం ప్రారంభించింది. తనను వదిలేసిన తర్వాతే అతడు ముస్లిం అని తెలిసిందని మహిళ పేర్కొంది. ఓ రోజు అతడు మరో మహిళతో కనిపించాడని తెలిపింది. 'నన్ను పెళ్లి చేసుకునేందుకు అతడు నిరాకరిస్తున్నాడు. ఈ విషయంపై ఒత్తిడి చెయ్యకుడా ఉండేందుకు సెటిల్మెంట్​ చేసుకుందామని చెప్పాడు. కానీ, నాకు న్యాయం కావాలి. అతడు ఒకవేళ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే కఠినంగా శిక్షించాలి' అని బాధితురాలు వాపోయింది. వాసిం ఖాన్​పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అదనపు ఎస్పీ శివరాజ్ తెలిపారు. స్థానిక మహిళా పోలీస్ స్టేషన్ ప్రాథమిక విచారణ ప్రారంభించినట్లు చెప్పారు.

కిరాతకంగా హత్య
బిహార్ పూర్ణియాలో దారుణం జరిగింది. ఆరేళ్ల బాలుడిని కిరాతకంగా గొంతు కోసి హత్య చేశారు. బాలుడి మర్మాంగాలను కత్తితో కోసేశారు. భద్రకోఠి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. మూడు రోజుల నుంచి బాలుడు కనిపించకుండా పోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. బాలుడి తల్లి ఏడాది క్రితమే చనిపోగా.. తండ్రి వేరే రాష్ట్రంలో కూలీ పని చేసుకుంటున్నాడు. మేనమామ ఇంట్లో అతడు ఉంటున్నాడు. అయితే, మూడురోజుల క్రితం పిల్లాడు ఇంట్లో నుంచి కనిపించకుండా పోయాడని మేనమామ జ్ఞనవర్ధన్ పోలీసులకు చెప్పారు. అయితే, పోలీసులు కేసు నమోదు చేయలేదని.. 24 గంటలు తర్వాత రావాలని చెప్పినట్లు పేర్కొన్నారు.

'ఆడుకుంటూ బయటకు వెళ్లిన బాలుడు రాత్రి 9 గంటలకు కనిపించకుండా పోయాడు. రాత్రంతా వెతికాం. ఎక్కడా కనిపించకపోయే సరికి పోలీస్ స్టేషన్​కు వెళ్లాం. కానీ వారు కేసు నమోదు చేసుకోలేదు. ఆ రోజంతా వెతికి తర్వాత రమ్మన్నారు. మేం వారించినా వినలేదు. రెండురోజులు వెతికిన తర్వాత బాలుడి శవం ఇంటి వెనక ఉన్న ఖాళీ భవనంలో కనిపించింది. ఓ దుప్పటిలో శవాన్ని కప్పిపెట్టారు. రహస్య భాగాలను కోసేశారు. ఇతర శరీర భాగాలపైనా తీవ్ర గాయాలు అయ్యాయి. అత్యంత కిరాతకంగా చంపేశారు' అని జ్ఞానవర్ధన్ తెలిపారు.

Last Updated : Jul 13, 2022, 2:57 PM IST

ABOUT THE AUTHOR

...view details