తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రూ.కోటి పరిహారం కోసం మాజీ ఎంపీలా నటించి.. చివరకు - యూపీ క్రైమ్​ న్యూస్

చనిపోయిన ఎంపీ పేరుతో భూసేకరణలో కోటి రూపాయల పరిహారాన్ని పొందడం కోసం పథకం పన్నాడు ఓ వ్యక్తి. నకిలీ ధ్రువీకరణ పత్రాలు సమర్పించాడు. చివరి క్షణంలో కథ అడ్డం తిరిగి.. కటకటాల (up crime news) పాలయ్యాడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ మీరట్​లో జరిగింది.

up crime news
చనిపోయిన ఎంపీలా నటించిన వ్యక్తి

By

Published : Nov 5, 2021, 12:14 PM IST

భూసేకరణలో రూ.కోటి నష్టపరిహారం (up crime news) పొందడం కోసం ఓ వ్యక్తి.. దివంగత ఎంపీలా నటించాడు. తానే ఆ ఎంపీనని అందుకోసం నకిలీ ధ్రువీకరణ పత్రాలు కూడా సమర్పించాడు. అయితే.. పరిహారం చెల్లించే ముందు అధికారులకు అసలు విషయం తెలిసింది. ఈ నాటకీయ సంఘటన సినిమాని తలపిస్తోంది.

ఎలాగంటే..

ఉత్తర్​ప్రదేశ్​లోని మీరట్​ జిల్లాలో రహదారుల విస్తరణలో భాగంగా ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది. అందుకు తగ్గ నష్టపరిహారాన్ని కూడా హక్కుదారులకు ఇస్తోంది. ఈ క్రమంలో రెండు సార్లు రాజ్యసభ ఎంపీగా పనిచేసిన ప్రేమ్ మనోహర్​కు చెందిన భూమి (26 ఏకరాలు) కూడా సేకరించింది. అయితే.. తానే ప్రేమ్​ మనోహర్​ని అని ఓ వ్యక్తి నష్టపరిహారం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అందుకు తగిన ధ్రువీకరణ పత్రాలు (పాన్, ఆధార్, బ్యాంకు పాస్​బుక్, ఓటర్​ ఐడీ, చిరునామా) కూడా జిల్లా యంత్రాంగానికి సమర్పించాడు. పరిహారం ఆ వ్యక్తికి ఇవ్వడానికి రూ.84 లక్షలను అధికారులు సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే అధికారులకు అసలు నిజం తెలిసింది.

2013లోనే మృతి..

ప్రేమ్ మనోహర్ ఉత్తర్​ప్రదేశ్​ నుంచి (1968-74, 1977-80) రెండు పర్యాయాలు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. జాతీయ రహదారి 119 వెంట 26 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. 2013లోనే ఆయన మృతి చెందారు.

ఈ విషయం తెలిసిన అధికారులు కంగుతిన్నారు. మనోహర్ కుమారుడు ప్రశాంత్ కుమార్ ద్వారా విషయాన్ని ధ్రువపరుచుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో దర్యాప్తు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ యంత్రాంగాన్ని ఆదేశించారు. నిందితున్ని అరెస్టు చేసినట్లు తెలిపారు.

ఇదీ చదవండి:అర్ధరాత్రి వేళ కుటుంబంపై కాల్పులు- ఒకరు మృతి

దారుణం.. 9వ తరగతి బాలికపై తండ్రీకొడుకులు అత్యాచారం

ABOUT THE AUTHOR

...view details