తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అయోధ్య రామాలయం పేరిట అక్రమ వసూళ్లు - ఉత్తరప్రదేశ్ అయోధ్య మందిరం

ఉత్తరప్రదేశ్​లోని అయోధ్య రామమందిర నిర్మాణం పేరిట అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమాలతో పాటు, ఇంటింటి ప్రచారాలు నిర్వహిస్తున్నాడని పోలీసులు తెలిపారు.

Man booked for collecting money for Ram temple
రామ మందిర నిర్మాణం పేరిట అక్రమ వసూళ్లు

By

Published : Dec 28, 2020, 1:06 PM IST

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అక్రమంగా విరాళాలు వసూలు చేస్తున్న వ్యక్తిపై ఉత్తర్​ప్రదేశ్​ పోలీసులు కేసు నమోదు చేశారు. మొరాదాబాద్​ జిల్లా భాజపా అధ్యక్షుడు రాజ్​పాల్ సింగ్​​ చౌహాన్​ ఫిర్యాదు మేరకు ఈ మోసానికి పాల్పడుతున్న వ్యక్తిని గుర్తించారు.

ఫోర్జరీ కేసు..

మందిర నిర్మాణం పేరిట సామాజిక మాధ్యమాలు, ఇంటింటి ప్రచారం ద్వారా విరాళాలు సేకరిస్తున్న వ్యక్తిని ప్రేమ్​వీర్​ సింగ్​గా గుర్తించామని మజోలా పోలీసు స్టేషన్​ అధికారి అవధేశ్​ కుమార్​ తెలిపారు. ఐపీసీ 419తో పాటు ఐటీ చట్టం(ఫోర్జరీ) కింద కేసు నమోదు చేశామని వివరించారు.

ప్రేమ్​వీర్​ సింగ్​ సామాజిక ఖాతాలను పరిశీలించిన పోలీసులు విశ్వ హిందూ మహాశక్తి సంఘ్​కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడికి విరాళాలిచ్చిన దాతల వివరాలను సైతం సేకరించామని, త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని తెలిపారు.

రామ మందిర నిర్మాణం పేరిట అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తి గురించి తెలిసిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశా. అతడితో పాటు, అతడికి సహకరించిన వారిని తక్షణమే అరెస్టు చేయాల్సిందిగా డిమాండ్​ చేస్తున్నా. అలాగే ఇలాంటి మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ధ్రువీకరణ లేనిదే విరాళాలివ్వొద్దని విజ్ఞప్తి చేస్తున్నా.

-రాజ్​పాల్ సింగ్​​ చౌహాన్, మొరాదాబాద్​ భాజపా జిల్లా అధ్యక్షుడు

ఇదీ చదవండి:జనవరి నుంచి రామ మందిర పునాది పనులు

ABOUT THE AUTHOR

...view details