'లవ్ జిహాద్' ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చాక ఉత్తర్ప్రదేశ్ బరేలీ పోలీసులు మొదటి అరెస్టు చేశారు. మొదటి కేసు నమోదైన మూడు రోజుల అనంతరం పోలీసులకు చిక్కాడు నిందితుడు.
తప్పించుకు తిరిగి...
20 ఏళ్ల వివాహిత మహిళను కిడ్నాప్ చేసి మతమార్పిడి చేసేందుకు యత్నించిన ఉవైష్ అహ్మద్(22)ను బరేలీ పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలు దేవరానియా ప్రాంతానికి చెందిన మహిళగా గుర్తించారు. పోలీసులు ఎన్కౌంటర్ చేస్తారనే భయంతో నిందితుడు తప్పించుకు తిరిగినట్లు విచారణలో తెలిపాడు.
" నిందితుడికి హాని తలపెట్టాలని పోలీసులు ఆలోచించలేదు. అతడ్ని అరెస్టు చేయడానికి మాత్రమే ప్రయత్నించారు. ఉవైష్ బుధవారం పట్టుబడ్డ తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచాం. ప్రస్తుతం అతడ్ని 14 రోజుల జుడిషియల్ కస్టడీకి తరలించారు".
-సన్సార్ సింగ్, అదనపు ఎస్పీ.