UP IPS Officer Seeks Retirement: ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపా తరఫున ఎన్నికల బరిలో దిగనున్నాడనే ఊహాగానాల మధ్య కాన్పూర్‌కు చెందిన పోలీస్ కమిషనర్ ఆసిమ్ కుమార్ అరుణ్ వీఆర్ఎస్(స్వచ్ఛంద పదవీ విరమణ) కోరుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ ముఖుల్ గోయల్‌కు పదవీ విరమణ లేఖను సమర్పించారు.
UP Elections News: యూపీ ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించిన అనంతరం అరుణ్ వీఆర్ఎస్ కోరుకున్నట్లు తన ఫేస్బుక్ పేజీలో ప్రకటించారు. భాజపా సభ్యునిగా తనను గుర్తించినందుకు సీఎం యోగి అధిత్యనాథ్‌కు ధన్యవాదాలు కూడా తెలిపారు. పార్టీలో అన్ని వర్గాల ప్రజలకు స్థానం కల్పించాలన్న పీఎం మోదీ సంకల్పాన్ని అర్థం చేసుకున్నట్లు చెప్పారు.