తెలంగాణ

telangana

By

Published : Apr 19, 2021, 6:07 PM IST

ETV Bharat / bharat

ఉత్తర్​ప్రదేశ్​లో ఐదు ప్రధాన నగరాల్లో లాక్​డౌన్​

దేశంలో కరోనా కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఉత్తర్​ప్రదేశ్​ రెండో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో వైరస్​ వ్యాప్తిని అరికట్టేందుకు మరోసారి లాక్​డౌన్​ అస్త్రాన్ని ప్రయోగించనుంది యూపీ సర్కార్​. ఐదు ప్రధాన నగరాల్లో ఈ రాత్రి నుంచే ఆంక్షలు అమల్లోకి వస్తాయిని స్పష్టం చేసింది.

Lockdown in UP
యూపీలో లాక్​డౌన్​

ఉత్తర్​ప్రదేశ్​లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న వేళ.. మరోసారి లాక్​డౌన్ అస్త్రాన్ని ఎంచుకుంది యోగి సర్కార్​. వైరస్​ వ్యాప్తి అధికంగా ఉన్న ఐదు నగరాల్లో ఆంక్షలు విధిస్తున్నట్టు తెలిపింది. సోమవారం రాత్రి నుంచే ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.

రాష్ట్ర రాజధాని లఖ్​నవూ సహా.. వారణాసి, కాన్పుర్​, గోరఖ్​పుర్​, ప్రయాగ్​రాజ్​లలో ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. మరోవైపు.. రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజుల లాక్​డౌన్​ను విధించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం.

ఇదీ చదవండి:దిల్లీలో లాక్​డౌన్- లిక్కర్​ షాపుల ముందు భారీ క్యూ

ABOUT THE AUTHOR

...view details