తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇంటర్​ టాపర్లకు క్యాష్​ ప్రైజ్​, ట్యాబ్​ల పంపిణీ! - విద్యార్థులకు క్యాష్ ప్రైజ్​, ట్యాబ్​లు

Up government for meritorious students: రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఇంటర్​, మెట్రిక్​ విద్యార్థులకు నగదు ప్రోత్సాహకంతో పాటు ట్యాబ్​లను అందించాలని యూపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలో జరగనున్న కార్యక్రమంలో విద్యార్థులకు వీటిని అందజేయనున్నారు.

Up government for meritorious students
యూపీలో ఇంటర్ విద్యార్థులకు నగదు బహుమతి

By

Published : Dec 27, 2021, 4:23 PM IST

Updated : Dec 27, 2021, 8:57 PM IST

Up government for meritorious students: రాష్ట్రంలోని కోటి మంది గ్రాడ్యుయేషన్, పారా గ్రాడ్యుయేషన్ చదివే విద్యార్థులకు మొబైల్ ఫోన్లు, ట్యాబ్​లు అందించే కార్యక్రమానికి ఇటీవలే శ్రీకారం చుట్టిన యోగి ఆదిత్యనాథ్​ నేతృత్వంలోని ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2020 సెషన్​లో ఇంటర్, మెట్రిక్​లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకంతో పాటు, ట్యాబ్​లు అందజేయాలని నిర్ణయించింది.

Cash tab prizes to inter students: రాష్ట్రస్థాయిలో టాపర్లుగా నిలిచిన వారికి రూ.లక్ష నగదు, జిల్లా స్థాయిలో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు రూ.21,000 నగదు బహుమతిని ప్రభుత్వం అందించనుంది. నగదుతోపాటు వారికి ట్యాబ్​లు కూడా ఇవ్వనుంది. త్వరలో జరిగే కార్యక్రమంలో విద్యార్థులకు ఈ బహుమతులు అందించనున్నారు.

వివిధ జిల్లాలకు చెందిన స్కూల్ ఇన్​స్పెక్టర్లకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించే బాధ్యతలను విద్యాశాఖ ఉన్నతాధికారులు అప్పగించారు. ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఇందుకు సంబంధించి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వినయ్ కుమార్ పాండే ఓ నోటిఫికేషన్ విడుదల చేశారు. మరోవైపు.. మెరిట్ విద్యార్థుల ఎంపిక ప్రక్రియ కూడా కొనసాగుతోంది.

కరోనాతో బ్రేక్...

అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఈ తరహా ప్రోత్సాహకాలను యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం​ గతంలోనూ ఇచ్చినప్పటికీ.. కరోనా ప్రభావంతో గతేడాది నిలిపివేసింది. అంతేగాకుండా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే పై తరగతులకు ప్రమోట్ చేశారు. అయితే.. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని పునఃప్రారంభించడానికి సిద్ధమైంది.

ఇదీ చూడండి:'రోడ్డుపై ఆ పని చేయడం బ్యాన్.. అవసరమైతే 144 సెక్షన్'

ఇదీ చూడండి:ఆ లక్ష్యాన్ని గడువుకు ముందే చేరుకున్నాం: మోదీ

Last Updated : Dec 27, 2021, 8:57 PM IST

ABOUT THE AUTHOR

...view details