Sex Change for Marriage: ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ఓ యువతి లింగ మార్పిడి చేయించుకుంటోంది. తోటి క్లాస్‌మేట్‌తో ప్రేమలో పడ్డ ఆమె.. లింగ మార్పిడితో అబ్బాయిలా మారేందుకు సిద్ధమైంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఈ ఘటన జరిగింది. నగరంలోని స్వరూప్‌రాణి నెహ్రూ ఆస్పత్రిలో నాలుగు నెలల క్రితమే యువతికి లింగ మార్పిడి చికిత్స ప్రారంభమైంది. అప్పుడు శరీర పైభాగంలోని అవయవాలకు శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు.. తాజాగా యువతి గర్భాశయాన్ని తొలగించారు. మరికొద్ది నెలల్లో చివరి శస్త్ర చికిత్స నిర్వహిస్తామని డాక్టర్లు తెలిపారు. ఆ సర్జరీతో యువతి జననాంగాలు మారిపోతాయని స్పష్టం చేశారు.
UP girl gender change:కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం.. లింగ మార్పిడి చేయించుకున్న యువతి బీఏ చదువుతోంది. ఫంఫామవూలో నివసిస్తోంది. బీఏలో తన తోటి స్నేహితురాలితో యువతి ప్రేమలో పడింది. ఈ ప్రేమ.. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థాయికి చేరింది. దీంతో విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పారు. ఇరుకుటుంబాలు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వినలేదు.