తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కదులుతున్న కారులో యువతిపై పోలీస్​ అత్యాచారం - మోన్​పురి జిల్లా వార్తలు

రక్షించాల్సిన పోలీసు అధికారే కామాంధుడిలా మారి యువతిపై కారులో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

UP girl raped by cop
యూపీలో దారుణం- యువతిపై కానిస్టేబుల్ అత్యాచారం

By

Published : Apr 11, 2021, 5:23 AM IST

Updated : Apr 11, 2021, 6:44 AM IST

ఉత్తర్​ప్రదేశ్​లో మరో పాశవిక ఘటన వెలుగుచూసింది. మోన్​పురి జల్లాలోని ఓ గ్రామానికి చెందిన యువతిపై పోలీసు అధికారి అత్యాచారానికి పాల్పడ్డాడు. శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇదీ జరిగింది..

ఓ పోలీసు అధికారి తన మిత్రుడు.. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్తున్న ఓ మహిళను అత్యాచారం చేశారు. ముందు ఇరువురూ కలిసి యువతిని బలవంతంగా కారులోకి ఎక్కించుకున్నారు. తర్వాత కదులుతున్న వాహనంలోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం గుర్తుతెలియని ప్రదేశానికి తీసుకెళ్లి బాధితురాలిని వదిలేసి పరారయ్యారు.

శనివారం తీవ్ర గాయాలతో ఇంటికి చేరుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఇద్దరు కామాంధులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేసింది. కాస్​గంజ్​ జిల్లాలోని పాటియాలా ఠాణాలో పనిచేస్తున్న కానిస్టేబుల్ ధర్మేంద్ర నిందితుల్లో ఒకడని తెలిపింది.

ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపినట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:క్షుద్రపూజల పేరిట యువతిపై అత్యాచారం

Last Updated : Apr 11, 2021, 6:44 AM IST

ABOUT THE AUTHOR

...view details