తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భర్తను చెట్టుకు కట్టేసి భార్యపై గ్యాంగ్ రేప్.. మహారాష్ట్రలో మైనర్లపై దారుణం.. - maharashtra minor rape

UP Gang rape: ఉత్తర్​ప్రదేశ్​లో ఘోరం జరిగింది. ఓ మహిళపై గ్యాంగ్​రేప్ చేశారు కొంతమంది దుండగులు. తన భర్తతో కలిసి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా.. అడ్డగించి ఈ దుస్సాహసానికి పాల్పడ్డారు.మరోవైపు, మహారాష్ట్రలో మైనర్లపై లైంగిక దాడి జరిగిన ఘటనలు వెలుగుచూశాయి.

UP GANGRAPE
UP GANGRAPE

By

Published : Mar 25, 2022, 1:15 PM IST

UP Gang rape: ఉత్తర్​ప్రదేశ్ ముజఫర్​పుర్​లో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని చెట్టుకు కట్టేసి.. అతడి భార్యపై గ్యాంగ్​రేప్​ చేశారు కొందరు దుండగులు. దంపతులు శుక్రవారం రాత్రి తమ ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు.

wife gang raped in Uttar Pradesh:దంపతులిద్దరూ తమ బంధువుల ఇంటికి వెళ్లి.. నడుచుకుంటూ తిరుగుపయనమయ్యారు. ఈ క్రమంలో 10 మంది వ్యక్తులు వారిని అడ్డగించారు. ఇద్దరినీ మామిడి తోటలోకి లాక్కెళ్లారు. నలుగురు కలిసి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె భర్తను చెట్టుకు కట్టేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్నామని నగర ఎస్పీ అర్పిత్ విజయవర్గియా స్పష్టం చేశారు. పది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అందులో ఇద్దరు మైనర్లు ఉన్నారని చెప్పారు. బాధిత మహిళను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించామని స్టేషన్ హౌస్ అధికారి పంకజ్ పంత్ తెలిపారు. మేజిస్ట్రేట్ సమక్షంలో ఆమె వాంగ్మూలాన్ని సేకరిస్తామని వివరించారు.

Minor Raped in Maharashtra:మహారాష్ట్రలోని అంటోప్ హిల్ ప్రాంతంలో ఘోరం జరిగింది. 13ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి గర్భవతిని చేశాడు ఓ వ్యక్తి. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో బాలికపై నిందితుడు(25) అత్యాచారం చేసేవాడని పోలీసులు తెలిపారు. అతడు బాధితురాలి ఇంటి పక్కనే ఉండేవాడని వెల్లడించారు. బాలిక కడుపు నొప్పి రాగా.. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షలు నిర్వహించగా.. విషయం బయటపడింది. బాలిక ఐదు నెలల గర్భవతి అని తేలింది. నిందితుడికి ఈ విషయం తెలియగానే ఇంట్లో నుంచి పరార్ అయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని మీరా రోడ్ ప్రాంతంలో పట్టుకున్నారు. అతడిని శుక్రవారం కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.

Sexual abuse for minor girl:మహారాష్ట్ర పుణెలో ఓ బాలికపై 36ఏళ్ల వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. స్కూల్​కు వెళ్తుండగా బాలికపై లైంగిక దాడి చేశాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు శివాజీ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఘటనపై ముమ్మర విచారణ జరిపి.. నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు. బాధితురాలు మైనర్ అయినందున.. కేసు విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:చనిపోయిన అన్న పేరుతో ప్రభుత్వ ఉద్యోగం.. 24ఏళ్లుగా దొరకకుండా...

ABOUT THE AUTHOR

...view details