UP gang rape 28 years: ఉత్తర్ప్రదేశ్ షాజహాన్పుర్లో అత్యాచార నిందితులపై 28 ఏళ్ల తర్వాత కేసు నమోదు చేశారు. పొరుగు ఇంట్లో ఉండే 12ఏళ్ల బాలికపై రెండేళ్ల పాటు ఇద్దరు అన్నాదమ్ములు బలాత్కారానికి పాల్పడ్డారు. 1994 నుంచి 1996 వరకు ఆ దుర్మార్గులు.. బాలికపై లైంగిక వాంఛలు తీర్చుకున్నారు. దీంతో ఆమె గర్భం దాల్చింది. మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే, బాలిక తన కొడుకు నుంచి దూరం కావాల్సి వచ్చింది. పుట్టిన బిడ్డను అదే రాష్ట్రానికి చెందిన దంపతులు దత్తత తీసుకున్నారు. నిందితులు బెదిరించడం వల్ల ఆ సమయంలో బాలిక పోలీసులను ఆశ్రయించలేకపోయింది. తనలో తాను కుమిలిపోతూ ఇన్నేళ్లు జీవితం సాగించింది.
12 ఏళ్ల బాలికపై రేప్.. 28ఏళ్ల తర్వాత కేసు.. డీఎన్ఏ టెస్టుతో షాక్! - యూపీ 28 ఏళ్ల క్రితం అత్యాచారం డీఎన్ఏ టెస్టు
UP gang rape 28 years: 12 ఏళ్ల వయసులో అత్యాచారానికి గురైన మహిళ.. తన కుమారుడి ప్రోద్బలంతో 28 ఏళ్ల తర్వాత న్యాయపోరాటానికి దిగింది. డీఎన్ఏ టెస్టులు నిర్వహించిన పోలీసులు.. నిందితులను గుర్తించారు. 28 ఏళ్ల క్రితం అత్యాచారం చేసిన వ్యక్తుల్లో ఒకడు.. మహిళ కుమారుడికి తండ్రి అని తేలింది.
అనూహ్య పరిణామాల మధ్య 2020లో తన కుమారుడిని కలుసుకుంది బాధిత మహిళ. విషయం తెలుసుకున్న మహిళ కుమారుడు.. న్యాయం కోసం పోరాడాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు తన తల్లిని ఒప్పించాడు. ఘటన జరిగిన 28ఏళ్ల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. డీఎన్ఏ టెస్టు ద్వారా నిందితులను గుర్తించారు. పరీక్షల్లో ఆ దుర్మార్గుల బాగోతం బయటపడింది. అత్యాచారం చేసిన సోదరుల్లో ఒకడు.. బాలుడి తండ్రేనని తేలింది. దీంతో మహిళ కేసులో బలమైన ఆధారాలు లభించినట్లైంది. తన తల్లికి న్యాయం జరిగే వరకు పోరాడతానని మహిళ కుమారుడు చెప్పుకొచ్చాడు. ఈ కేసుకు సరైన ముగింపు లభించే వరకు విశ్రమించేది లేదని మీడియాతో చెప్పాడు.
ఇదీ చదవండి:'జవాబులు రాసేదే లే'.. పదో తరగతి ఆన్సర్ షీట్లో పుష్పరాజ్!