ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో రాష్ట్రంలోనే తొలిసారిగా ట్రాన్స్జెండర్ల కోసం శౌచాలయాలు ఏర్పాటు చేశారు. వారణాసి నగర పాలక సంస్థ వీటిని మంగళవారం అందుబాటులోకి తెచ్చింది. వచ్చే మూడు నాలుగు నెలల్లో మరిన్ని శౌచాలయాలు నిర్మిస్తామని అధికారులు స్పష్టం చేశారు.
" ఇప్పటివరకు మహిళలకు, పురుషులకు మాత్రమే శౌచాలయాలు అందుబాటులో ఉన్నాయి. ట్రాన్స్జెండర్లకు ఇది పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్యకు పరిష్కారంగా వీటిని నిర్మించాము. రెండు మూడు నెలల్లో నగరంలో మరో నాలుగు శౌచాలయాలాను అందుబాటులోకి తెస్తాము."
-గోరంగ్ రాఠీ, వారణాసి నగర కమిషనర్
మాకు తగిన శౌచాలయాలు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ప్రభుత్వం ఈ శౌచాలయాలు అందుబాటులోకి తెచ్చినందుకు సంతోషంగా ఉంది. ప్రతి నగరంలోనూ ఇలాంటివి అందుబాటులోకి తేవాలని విజ్ఞప్తి చేస్తున్నాము.