UP Eunuch Rape: ఉత్తర్ప్రదేశ్లో దారుణం జరిగింది. ఏడేళ్ల బాలికపై ఓ హిజ్రా లైంగిక దాడి చేసిన ఘటన బరేలీలోని మిరాజ్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అత్యాచారం విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బాలికను హిజ్రా బెదిరింపులకు గురి చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి తల్లి దీనిపై పోలీసులను ఆశ్రయించి, కేసు పెట్టింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు.. పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. అయితే, హిజ్రా పరారీలో ఉన్నట్లు సమాచారం.
Eunuch Rape News:బాధితురాలి ఇంటికి సమీపంలోనే ఫరీన్ అనే హిజ్రా నివసిస్తున్నట్లు తెలుస్తోంది. పక్కింట్లో టీవీ చూస్తున్న సమయంలో బాలిక దగ్గరికి వెళ్లి ఆమెను తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాలికపై హిజ్రా బలవంతంగా అత్యాచారానికి పాల్పడినట్లు చెప్పారు. మార్చి 29నే ఈ ఘటన జరిగిందని వెల్లడించారు. బాధితురాలు హిజ్రాకు భయపడి విషయం చెప్పలేదని తెలిపారు. అయితే, కడుపు నొప్పి అధికం కావడం వల్ల కుటుంబ సభ్యులకు జరిగిన ఘటన గురించి వివరించింది బాలిక. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. హిజ్రాను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.