Up Elections 2022: ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(భాజపా), సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)లను ఎదుర్కోవడానికి బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి పంచతంత్రాన్ని రూపొందించారు. ఐదు అంశాలపై ఆమె తన ప్రత్యర్థులను ఎన్నికల క్షేత్రంలో ఇరుకున పెట్టేందుకు వ్యూహాలు అనుసరిస్తున్నారు. ఈ ఎన్నికల రణతంత్రం.. మళ్లీ యూపీలో బీఎస్పీని అధికార పీఠం ఎక్కిస్తుందని ఆమె నమ్ముతున్నారు. ఆ అంశాలేంటంటే..
1.దళితుల హక్కులు
Mayawati News: భాజపా-ఎస్పీలను దళిత వ్యతిరేకులని మాయావతి ప్రచారం చేయనున్నారు. దీని వల్ల చెల్లా చెదురైన తన ఓటు బ్యాంకును ఏకీకృతం చేయాలన్నది ఆమె ప్రణాళిక. ముఖ్యంగా రిజర్వేషన్ల అంశంపై అధికార భాజపాను ఆమె నిలదీయనున్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వివిధ మార్గాల ద్వారా రిజర్వేషన్ల ప్రభావాన్ని తగ్గించేందుకు భాజపా చేస్తున్న ప్రయత్నాలను ప్రజలకు వివరించనున్నారు. కులగణనను భాజపా వ్యతిరేకించటాన్ని కూడా ఆమె ప్రస్తావించనున్నారు. పార్లమెంటులో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ బిల్లును చింపివేసిన సమాజ్‌వాదీ పార్టీ విషయంలోనూ దళితులు అప్రమత్తంగా ఉండాలని ఆమె హెచ్చరించనున్నారు.
2. శాంతిభద్రతలు
Mayawati Election Seat: యూపీలో శాంతి భద్రతల అంశాన్ని మాయావతి ప్రధానంగా లేవనెత్తనున్నారు. ఇందులో లఖింపుర్ హింస, పోలీస్ కస్టడీలో మరణాలు, ఎన్‌కౌంటర్లు, మహిళలపై హింసాత్మక ఘటనలపై ఆమె యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు. అదే సమయంలో ఎస్పీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన హింసనూ ప్రస్తావించనున్నారు
3.నిరుద్యోగం-రైతులు