UP Elections 2022: ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అధికార భాజపా దూసుకెళ్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ సమాజ్‌వాదీ పార్టీ రెండో స్థానంలోనే కొనసాగుతోంది. ఇతర పార్టీలు ప్రభావం చూపలేకపోతున్నాయి.
యూపీలో దూసుకెళ్తున్న భాజపా- ఎగ్జిట్ పోల్స్ లెక్క పక్కా! - ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికలు
UP Elections 2022: ఉత్తర్‌ప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎన్నికల తర్వాత విడుదలైన ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ అధికార భాజపా స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్తోంది. చెప్పినట్లుగానే సమాజ్ వాదీ పార్టీ రెండో స్థానంలో కొనసాగుతోంది.
యూపీ పోల్స్
యూపీ ఓట్ల లెక్కింపు- టాప్ 10 హైలైట్స్
- ఉత్తర్‌ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో నిజమవుతున్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు
- స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్తున్న అధికార భాజపా
- ఆధిక్యంలో మ్యాజిక్ ఫిగర్ దాటేసిన అధికార పార్టీ
- రెండో స్థానంలో కొనసాగుతున్న సమాజ్‌వాదీ పార్టీ
- ప్రభావం చూపలేక పోయిన బహుజన సమాజ్ పార్టీ
- సింగిల్ డిజిట్ దాటేందుకు కాంగ్రెస్ ఆపసోపాలు
- పలు చోట్ల స్వతంత్ర అభ్యర్థుల ముందంజ
- గోరఖ్‌పుర్ అర్బన్ స్థానంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆధిక్యం
- కర్హాల్ స్థానంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ లీడ్
- జశ్వంత్‌నగర్ స్థానంలో ఎస్పీ అభ్యర్థి శివపాల్ యాదవ్(అఖిలేశ్‌కు బాబాయి) వెనుకంజ
Last Updated : Mar 10, 2022, 1:22 PM IST