UP Election 2022: మెయిన్‌పురిలోని కర్హాల్ స్థానం నుంచి అఖిలేశ్ యాదవ్‌పై కేంద్ర న్యాయ సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ పోటీ చేస్తున్నారు. ఈ రోజు మెయిన్‌పురి కలెక్టరేట్‌కు చేరుకున్న ఆయన తన నామినేషన్ దాఖలు చేశారు.
కేంద్ర న్యాయ సహాయ మంత్రి ఎస్పీ సింగ్ ఆగ్రా నుంచి ఎంపీగా గెలుపొందారు. మొదట్లో సమాజ్‌వాదీ పార్టీ నుంచే రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. 2009లో బీఎస్పీలో చేరారు. 2014లో భాజపాలో చేరారు.
అఖిలేష్ నామినేషన్..
అఖిలేష్ యాదవ్ కూడా కర్హాల్ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఈసారి యూపీ ఎన్నికలు మరో శతాబ్దపు దేశ చరిత్రను తిరగరాస్తాయని ఈ సందర్భంగా అన్నారు. దుష్ట రాజకీయాన్ని ఓడించాలని ప్రజలను కోరారు.