UP election 2022: ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల వేళ.. అధికార, ప్రతిపక్ష పార్టీలు వరాల జల్లు కురిపిస్తున్నాయి. ఓటర్లను ఆకర్షించడానికి సంక్షేమ పథకాలు ప్రకటిస్తున్నాయి. తాజాగా ఉతర్ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అటువంటి హామీతో ప్రజల ముందుకు వచ్చారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే.. ప్రతి కుటుంబానికి నెలనెల 'డబుల్ రేషన్' అందిస్తుందని హామీ ఇచ్చారు. గాజియాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో యోగి పాల్గొన్నారు.
'రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తే.. కరోనా టీకా రెండు డోసులు అందించినట్లే ప్రతినెలా డబుల్ రేషన్ ఉచితంగా పంపిణీ చేస్తాం' అని యోగి హామీ ఇచ్చారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో 135 కోట్ల మందికి ఉచితంగా కరోనా టీకా, చికిత్స, పరీక్షలు చేస్తున్నారు. అయితే "టీకా విషయంలో తప్పుదోవ పట్టించేందుకు కొందరు ప్రయత్నించారు. ఇది భాజపా వ్యాక్సిన్ అని, టీకాలు వేసుకోవద్దన్నారు. అది భాజపా టీకా కాబట్టి భాజపాకు మాత్రమే ఓటు వేస్తామని వారికి చెప్పండి" అని యోగి వ్యాఖ్యానించారు.