తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎక్కడికెళ్లినా అఖిలేశ్​ వెంటే ఆ మూట.. ఇంతకీ అందులో ఏముంది? - యూపీ ఎన్నికలు 2022

UP Election 2022: యూపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సమాజ్​వాదీ పార్టీ అధినేత అఖిలేశ్​ యాదవ్​ ప్రచారం ముమ్మరం చేశారు. అయితే ఆయన ఎక్కడికెళ్లినా వెంట ఓ చిన్న ఎర్రటి మూటను తీసుకెళ్తున్నారు. ఇంతకీ అందులో ఏముంది? దీనిపై అఖిలేశ్​ మాటేమిటి?

UP Election 2022:
అఖిలేశ్​ యాదవ్

By

Published : Jan 30, 2022, 3:37 PM IST

Updated : Jan 30, 2022, 4:45 PM IST

ఎన్నికల వేళ ఎర్రమూటను వెంట తీసుకెళ్తున్న అఖిలేశ్​ యాదవ్​

UP Election 2022: మరికొద్ది రోజుల్లో ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. సమాజ్​వాదీ పార్టీ అధినేత అఖిలేశ్​ యాదవ్​ కూడా విస్తృతం ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే ఇటీవల ఆయన ఎక్కడికి వెళ్లినా ఓ చిన్న ఎర్రటి మూటను జేబులో పెట్టుకుని వెంట తీసుకెళ్తున్నారు. ఆ మూటలో ఏముంది? అసలు దానిని అఖిలేశ్​ వెంట ఎందుకు తీసుకెళ్తున్నారు? అనే విషయంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

ఆర్​ఎల్​డీ అధినేత జయంత్​ చౌదరితో ఎస్​పీ చీఫ్​ అఖిలేశ్​ యాదవ్
జయంత్​ చౌదరితో సంయుక్తంగా ప్రమాణం

పార్టీ ప్రచారంలో భాగంగా గాజియాబాద్​లో అఖిలేశ్​ యాదవ్​ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా రాష్ట్రీయ లోక్​దళ్​ అధినేత జయంత్​ చౌదరితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ మూట వెనుక రహస్యాన్ని వెల్లడించారు. ఈ మూటలో అన్నం ఉందని తెలిపారు. భాజపాను గద్దెదించాలనే లక్ష్యంతో ఉన్న అఖిలేశ్​.. యూపీలో ఆ పార్టీ ఓటమి చవిచూసే వరకు పోరాటం ఆపమని ఆ అన్నంపై ప్రమాణం చేసినట్లు చెప్పుకొచ్చారు. తమ నేతలతో కూడా ఈ మూటపై ప్రమాణం చేయిస్తున్నట్లు తెలిపారు.

చేతిలోని ఎర్ర మూటను చూపిస్తున్న అఖిలేశ్​ యాదవ్

ఈ సందర్భంగా జయంత్​ చౌదరితో కలిసి మరోసారి ఆ ఎర్రమూటపై ప్రమాణం చేశారు అఖిలేశ్​ యాదవ్.

"ఈ ప్రచారంలో నేను ఓ ఎర్ర మూటను వెంట తీసుకెళ్తున్నాను. ఇందులో అన్నం ఉంది. నేతలతో అన్నంపై ప్రమాణం చేయించేందుకు నేను దీనిని తీసుకెళ్తాను. ఇదే అన్నంపై ఆధారపడి మనం జీవిస్తున్నాం. ఈ సందర్భంగా భాజపాను గద్దెదించే వరకు పోరాటం ఆపమని మేము ఇద్దరం సంయుక్తంగా ప్రమాణం చేస్తున్నాం."

-అఖిలేశ్​ యాదవ్​, సమాజ్​వాదీ పార్టీ అధినేత

రైతులకు అన్యాయం చేసిన భాజపా ప్రభుత్వాన్ని ఓడించడమే తమ లక్ష్యమన్నారు అఖిలేశ్​ యాదవ్.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్​ ఉచితం!

ఇదీ చూడండి :'టీకా తీసుకుంటే నా 8 మంది పిల్లలేంగాను?'.. వీడియో వైరల్​

Last Updated : Jan 30, 2022, 4:45 PM IST

ABOUT THE AUTHOR

...view details