UP Election 2022: యూపీలో మరికొన్ని గంటల్లో మొదటి దశ పోలింగ్ ప్రారంభకానున్న క్రమంలో ఆ రాష్ట్రంలో ఆసక్తికర సంఘటన జరిగింది. ఛర్తావాల్ నియోజకవర్గం ఆప్ అభ్యర్థి యవర్ రోషన్.. సమాజ్‌వాదీ(ఎస్పీ) పార్టీలో చేరారు. తన మద్దతు ఛర్తావాల్ నియోజకవర్గం ఎస్పీ అభ్యర్థి పంకజ్ మాలిక్‌కు ఉంటుందని తెలిపారు.
ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసినట్లు చెప్పారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ అవుతోంది.