2022 ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఘన విజయం సాధిస్తుందని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ధీమా వ్యక్తం చేశారు. ఈసారి కూడా 300 పైచిలుకు స్థానాల్లో పాగా వేస్తామన్నారు. వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో పార్టీ సన్నద్ధతపై భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత) బీఎల్ సంతోష్‌తో మంగళవారం ఆయన భేటీ అయ్యారు.
"2022లో యూపీలో చారిత్రక విజయం సాధిస్తాం. ఈసారి కూడా 300 స్థానాలకుపైగా గెలుస్తాం. ఈ క్రమంలోనే ప్రజల్లోకి కార్యకర్తలు చేరువయ్యే అంశంపై సమావేశంలో చర్చించాం."