ఉత్తర్ప్రదేశ్ షాజహాన్పుర్ జిల్లా కట్రాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ముందుగా పిల్లలకు ఉరివేసి, తర్వాత దంపతులిద్దరు ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు.
ఏం జరిగింది?

షాజహాన్పుర్, కట్రాకు చెందిన అఖిలేశ్ గుప్తా(42),రిషు గుప్తా(39) దంపతులు. ఇటీవల అఖిలేశ్ గుప్తా.. ఇంటి నిర్మాణం కోసం ఓ వ్యక్తి వద్ద అప్పు చేశాడు. అయితే.. అప్పు తీర్చాల్సిందిగా సదరు వ్యక్తి ఇబ్బంది పెట్టేవాడు. దీంతో ఆర్థిక వేదింపులు తాళలేక బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు అఖిలేశ్ రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు వివరించారు. ముందుగా ఇద్దరు పిల్లలు శివాంగ్(12), హర్షిత(9)లకు ఉరివేసి.. తర్వాత దంపతులు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్పీ ఎస్. ఆనంద్ తెలిపారు.
సూసైడ్ నోట్ ఆధారంగా డబ్బు కోసం.. కుటుంబాన్ని వేధించిన వ్యక్తిపై కేసు నమోదు చేశామన్నారు.
ఇదీ చదవండి :కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం- 18మంది మృతి